YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట ఏప్రిల్ 30
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల వెంకటాపూర్ లో మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ  మామిడి కాయల విక్రయాల్లో కొత్త ఒరవడి సృష్టించేలా ఈ సేకరణ కేంద్రం మామిడి రైతులకు వరం. జిల్లా సెర్ఫ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో సేకరణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు.  సేకరణ కేంద్రంతో మామిడి రైతులకు మూడు రకాలుగా ఎంతగానో మేలు చేకూరుతుంది. మామిడి రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైతులకు తరుగు ఇబ్బంది,  వ్యయ ప్రయాసాలు తప్పుతాయి. గడ్డి అన్నారం మార్కెట్ ధర ప్రకారం రోజూ వారీగా ధరలు ఉంటాయి.   ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి. 1700 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయని ఇక్కడ మామిడి కాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. మామిడి రైతులు నాణ్యమైన దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ కూడా ఇప్పించాం.   జిల్లా వ్యాప్తంగా 13 వేల 400 ఏకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. మామిడికే కాకుండా సెర్ఫ్ పద్ధతిలో కూరగాయల విక్రయాలు జరిపేలా యోచనలో ఉన్నామని అన్నారు.  సిద్ధిపేట జిల్లాలో అత్యధిక మామిడి సాగు కలిగి ఉన్న నంగునూరు మండలాన్ని గుర్తించాం. నంగునూరు మండలంలో 14 గ్రామాలు ఎంపిక చేశాం. 275 ఏకరాలు తోటలు విస్తీర్ణంలో ఈ యేడు మామిడి దిగుబడి 5 వేల క్వింటాళ్లు వస్తుందని అంచనా.  - నంగునూరు మండలంలో 14 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సంఘాల్లో మామిడి సాగు చేస్తున్న మంది 115 సభ్యులు, మొత్తం 199 మంది సభ్యులు ఉన్నారు.   మామిడి రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర, మార్కెటింగు వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఎఫ్ పీసీ ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బె నిషాన్ కంపెనీతో ఒప్పందం చేసింది.   గతంలో 3 జిల్లాలు ఈ యేడు 13 జిల్లాలతో సెర్ఫ్ ఆధ్వర్యంలో చేపట్టాం.   రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలోని 35 మండలాల్లో మహిళా సమాఖ్య, మహిళా రైతుల-ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపనీ ఆధ్వర్యంలో మామిడి కాయల కొనుగోళ్ల కేంద్రం ఏర్పాటుకై నిర్ణయించామని అన్నారు.  నంగునూరు మండలంలోని 13 గ్రామాల్లో 115 మంది చిన్న సన్నకారు మహిళా మామిడి రైతులను గుర్తించాం.  - మహిళా మామిడి రైతులందరికీ మామిడి కాయల సేకరణ- మార్కెటింగ్, ఎఫ్ పీసీ ప్రాధాన్యత వివరిస్తూ., ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులు ఏర్పాటు చేసి ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో వాటా దారులుగా చేర్చతాం. ఈ వాటా దారుల నుంచి పండించిన మామిడి కాయలను సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపనీ లిమిటెడ్ అనుసంధానమైన జగదేవ్ పూర్ వారు కొనుగోళ్లు చేసి, ఎఫ్ పీసీ ద్వారా ఏర్పాటు చేసిన బెనిషాన్ కంపనీకి పంపిస్తుంది. - బెనిషాన్ కంపనీ ముందస్తుగా తీసుకున్న ఇండెంట్ ఆధారంగా బిగ్ బాస్కెట్, రత్నదీప్, రిలయన్స్, మోర్, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రిటైలర్స్ కు విక్రయాలు జరుపుతుంది. - బెనిషాన్ కంపనీ మార్కెట్ స్థితిగతుల ఆధారంగా రోజూ/ వారం వారీగా ప్రకటించిన ధర ప్రకారమే రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోళ్లు చేపడుతుంది.  రైతులకు ఏలాంటి కమీషన్, తరుగు, ట్రాన్స్ పోర్ట్ రవాణా ఖర్చులు ఉండవు.  మామిడి రైతులు ఫీల్డ్, క్షేత్రస్థాయిలోనే మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించాం.  బెనిషాన్ కంపనీ ప్రతి వారం ఎఫ్ పీసీకి బిల్లు చెల్లింపులు చేపట్టేలా చర్యలు తీసుకున్నాం.  ఎఫ్ పీసీ నుంచి నేరుగా వారానికి ఒక్కసారి మామిడి రైతు బ్యాంకు ఖాతాకు జమ చేసేలా చర్యలు తీసుకున్నాం.  మామిడి రైతులు గ్రేడింగ్ చేసి అమ్మడంతో అధిక ధరలు పొందే అవకాశం ఉంది. దీనిని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి.  మామిడి రైతు ప్రత్యేకంగా మార్కెట్ ధర పొందటంతో పాటుగా బెనిషాన్ కంపనీ వ్యాపారంలో వచ్చిన లాభంలో 50 శాతాన్ని తిరిగి రైతులు అమ్మకం ఆధారంగా డివిడెంట్ రూపంలో పొందుతారని మంత్రి అన్నారు. జిల్లాలో నంగునూరు, కొహెడ, అక్కన్నపేట, మద్దూర్, చిన్నకోడూర్, కొండపాక, జగదేవ్ పూర్ మండలాల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న దృష్ట్యా బెనిషా కొనుగోళ్ల కేంద్రాలను ఈ పంటకే అందించేలా ఏర్పాటు చేయించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావుకు మంత్రి ఆదేశాలిచ్చారు.  

Related Posts