తీరని లోటు : కేటీఆర్
హైద్రాబాద్, ఏప్రిల్ 30
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ మరణ వార్తపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రిషీ కపూర్ ఇక లేరనే వార్త వినడానికి చాలా షాకింగ్‌గా ఉందన్నారు. ‘ఈ ఏడాది, ఈ వారం ఎంత భయానకంగా ఉంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈ రోజు దిగ్గజ నటుడు రిషీ కపూర్ వెళ్లిపోయారు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మీ ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బుధవారం బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నుంచి కోలుకోక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రిషీ కపూర్ (67) గురువారం (ఏప్రిల్ 30) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన కన్నుమూసిన విషయాన్ని అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.బాలీవుడ్ దిగ్గజం రాజ్ కుమార్ కుమారుడైన రిషీకి 2018లో క్యాన్సర్ బయటపడింది. నాటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. సమయం చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. తనదైన నటనతో అలరిస్తున్నారు. చివరి ట్వీట్‌లోనూ అదే తపన.. నటనతో బిజీగా ఉన్నా రిషీ కపూర్ ట్విట్టర్‌లో చురుగ్గా ఉండేవారు. సమకాలీన అంశాలు, సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. చివరగా ఆయన ఏప్రిల్ 2న ఓ ట్వీట్ చేశారు. కొవిడ్-19పై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులపై దాడులకు నిరసనగా తన గళం వినిపించారు.ప్రజల ప్రాణాలు కాపడటానికి కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులపై హింసాత్మక చర్యలకు పాల్పడొద్దని రిషీ కోరారు. రాళ్లు విసరడం లాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘మనందరం కలిసి కరోనా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కోవాలి’ అని రిషీ కపూర్ పిలుపునిచ్చారు.