YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం దేశీయం

క్యాన్సర్ తో ఓడిపోయిన నటుడు రిషి కపూర్

క్యాన్సర్ తో ఓడిపోయిన నటుడు రిషి కపూర్

క్యాన్సర్ తో ఓడిపోయిన నటుడు రిషి కపూర్
ముంబై, ఏప్రిల్ 30
ప్రముఖ నటుడు రిషీ కపూర్ కాన్సర్ కారణంగా మృతిచెందారు.. కాన్సర్ తిరగబెట్టటం వలన ఈ మరణం సంభవించిందని అంటున్నారు. ఆయన వయసు 67 సంవత్సరాలుకొలోన్ ఇన్ ఫెక్షన్ వలన ఇర్ఫాన్ ఖాన్ మరణించిన వార్తని ఇంకా జీర్ణించుకోకముందే మరో ప్రముఖ వ్యక్తి మరణించారు. ఈ వార్త మనకు తెలిసింది. నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేనందువలన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన సోదరుదు రణ్‌దీర్ కపూర్ ముందుగా మీడియా తో మాట్లాడుతూ ఎలాంటి తీవ్రమైన సమస్య లేదన్నారు."ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన కాన్సర్ తో బాధపడుతునారు. ఇంకా శ్వాస తీసుకోవడం సమస్యలు కూడా రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉంది." అని తెలిపారు. రిషీ కపూర్‌కి భార్య నీతూ కపూర్, పిల్లలు రణ్ బీర్ కపూర్, రిధిమా కపూర్ ఉన్నారు.రిషీ కపూర్ ఈ మధ్య కాలంలో అనారోగ్యంగా ఉన్నారు. 2018 లో ఆయన కు కాన్సర్ ఉందని తెలియడంతో ఆయన్ని వెంటనే చికిత్స కోసం న్యూయార్క్ తీసుకెళ్ళారు. అయితే కుటుంబంలో ఎవరూ ఆయన కి వచ్చిన కాన్సర్ గురించి గానీ, చికిత్సా విధానం గురించి గానీ వివరాలేమీ ఇవ్వకపోయినా, వారు ఎదుర్కొంటున్న కష్టకాలం గురించి తర్వాత మాట్లాడుతూనే ఉన్నారు. రిషీ కపూర్ మాత్రం తను చికిత్స తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆయాన బోన్ మారో గురించి చాలా చెప్పారు.ఈ సంవత్సరం మొదట్లో ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులెదురైతే ఆయనని ఢిల్లీ లోని ఒక హాస్పిటల్ లో ఎవ్వరికీ తెలియకుండా అడ్మిట్ చేశారు. ఆయనని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. వార్త బయటికి రాకపోయినా ఆయన న్యుమోనియా తో బాధపడుతున్నట్టు తెలిసింది.ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన కుటుంబాన్నీ, స్నేహితులనూ ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తను అనారోగ్యాన్ని ఆయన అంగీకరించలేకపోతున్నారని తెలిసింది. ఆయన ఒకసారి ఇలా అన్నారట."నాకు కొంచెం జ్వరంగా ఉంది. డాక్టర్లు న్యుమోనియా ని అనుమానించి పరీక్షలు చేస్తే వారి అనుమానం నిజమని తెలిసింది. చికిత్స తరువాత నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు వచ్చాయని నాకు తెలుసు. అవన్నీ నమ్మకండి. నేనిప్పుడు ముంబై లోనే ఉన్నాను. మీతో వినోదాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను"రిషీ కపూర్ ఎప్పుడూ ఏ విషయానికైనా సానుకూలంగానే స్పందిస్తారు. ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ లో ఆయన తన ఆరోగ్యం గురించి ఇలా అన్నారు:"రోజులు బాగా లేవు అంటే అర్ధం నాకేదో ప్రమాదకరమైన సర్జరీ జరిగిందనో, నేను తీవ్రమైన నొప్పి తో బాధపడుతున్నానో కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య ఉంటుంది. ఈ సమస్య కిడ్నీ గురించి కావొచ్చు. లివెర్ కి సంబంధించినది కావొచ్చు. గుండె జబ్బులు కావచ్చు. నాకు మారో తో సమస్య వచ్చింది, నేను ఆ సమస్యని పోగొట్టుకోగలిగాను. అందులో ప్రమాదకరమైనది ఏదీ లేదు. అయితే రెండు చికిత్సా కాలాల మధ్య చాలా సమయం ఉండడంతో, మేము ఎక్కువగా అటూ, ఇటూ తిరిగేవాళ్ళం. ఏం చేస్తాం చెప్పండి, విమానప్రయాణం చెయ్యకూడదూ, ఎక్కువ దూరం ప్రయాణించకూడదూ అంటే ఎలా.. నేను తీసుకున్న చికిత్స విజయవంతమైంది. నా కుటుంబం, స్నేహితులూ, అభిమానులూ నాకిచ్చిన బలానికి కృతజ్ఞుణ్ణి. వీరందరూ ఇచ్చిన ధైర్యానికి ధన్యవాదాలు". అని తెలిపారు

Related Posts