YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంట్లోనే గడిపేస్తున్న వైసీపీ నేతలు

ఇంట్లోనే గడిపేస్తున్న వైసీపీ నేతలు

ఇంట్లోనే గడిపేస్తున్న వైసీపీ నేతలు
విజయవాడ, మే 1
వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవ‌హారం పార్టీలోనే చ‌ర్చకు వ‌స్తోంది. ప్రస్తుతం క‌రోనా ఎఫెక్ట్‌తో విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా.. అన్ని వ‌ర్గాల ప్రజ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా పేద‌లకు, వ‌ల‌స కూలీల‌కు ఇబ్బందులు త‌ప్పడం లేదు. ఈ క్రమంలో వారికి అండగా ప్రభుత్వం అనేక రూపాల్లో సేవ‌లు విస్తృతం చేసింది. అయినాకూడా లాక్‌డౌన్ ప్రభావం పెరుగుతుండ‌డంతో ఈ సాయం స‌రిపోవ‌డం లేద‌న్నది నిజం. దీంతో రాజ‌కీయంగా, పారిశ్రామికంగా కూడా దాత‌లు, నాయ‌కులు, ఆర్ధిక ఉద్ధండులు ముందుకు వ‌స్తున్నారు. వారు త‌మకు తోచిన రీతిలో ప్రజ‌ల‌కు సేవ చేస్తున్నారు.రాజ‌కీయంగా చూసుకుంటే.. ప్రతిప‌క్షాలు మ‌న రాష్ట్రంలో సైలెంట్ అయిపోయాయి. తాము చేయాల్సింది కేవ‌లం విమ‌ర్శలేన‌ని అంత‌కు మించి ఏమీ చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేస్తున్నారు. ఇక‌, మిగిలిన అధికార పార్టీ నాయ‌కులు స్పందిస్తున్నారు. కొంద‌రు పారిశ్రామిక వేత్తల‌ను ప్రోత్సహించి సీఎంకు విరాళాలు ఇచ్చేలా చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం తాము చేస్తున్న కార్యక్రమాల‌ను భారీ ఎత్తున చేప‌డుతున్నారు. శ్రీకాకుళం, న‌గ‌రి, సూళ్లూరుపేట వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగింది ఇదే. తాము చేసిన సాయానికి డ‌బుల్ ప్రచారం కోరుకుంటూ.. వారు చేసిన ప్రయ‌త్నం కాస్తా విమ‌ర్శల‌కు తావిచ్చింది. వీరి పంథాతో పార్టీ ఇరుకున‌ప‌డింది.వైసీపీలోని ఇంకొంద‌రు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యస‌భ స‌భ్యులు కూడా ఉండడం గ‌మ‌నార్హం. ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా ఎంపీలు దాదాపు సైలెంట్ అయిపోయారు. ఒక‌రిద్దరు ఎంపీలు మాత్రమే త‌మ ఎంపీలాడ్స్ నుంచి నిధులు రాష్ట్ర సీఎం కు ఇచ్చారు. మిగిలిన వారంతా కూడా మౌనం పాటించారు. ఇదిలావుంటే కొంద‌రు మాత్రం ఎలాగూ త‌మ ఎంపీ లాడ్స్‌లో చాలా మేర‌కు కేంద్రమే తీసేసుకుంది కాబ‌ట్టి.. ఇప్పుడు సొంత డ‌బ్బులు ఇవ్వలేంలే.. అనుకుంటూ.. ఇంట్లోనే గ‌డిపేస్తున్నారు.వైసీపీకి లోక్‌స‌భ ఎంపీలే ఏకంగా 23 వ‌ర‌కు ఉన్నారు. వీరిలో లావు శ్రీకృష్ణదేవ‌రాయులు లాంటి వాళ్లు మిన‌హా మిగిలిన వారెవ్వరు అస్స‌లు క‌నీసం మీడియాలో కూడా క‌న‌ప‌డ‌ని ప‌రిస్థితి. వీరిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్నాయి. అదేవిధంగా న‌ర‌సాపురం ఎంపీ త‌న ఎంపీ లాడ్స్‌లో సింహ‌భాగాన్ని పీఎం నిధికి ఇచ్చి సైలెంట్‌గా ఉంటున్నార‌ట‌. దీంతో వైసీపీలో కొంద‌రు అతి చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇలా ఫుల్ సైలెంట్ అయిపోతున్నారంటూ.. సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts