YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

కొనసాగుతున్న బంగారం పతనం

కొనసాగుతున్న బంగారం పతనం

కొనసాగుతున్న బంగారం పతనం
ముంబై,  మే 1
నిన్నపెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గుదల కనబరిచాయి. శుక్రవారం బంగారం ధరలు దేశీయంగా కిందికి దిగోచ్చాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి.బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి.  బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 470 రూపాయల తగ్గుదల నమోదు చేసి 43,950 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 490 రూపాయల తగ్గుదలతో 46,700 రూపాయలు నమోదు చేసింది.బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదలను నమోదు చేశాయి. కేజీకి 1010 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర ఎగబాకింది. కేజీ వెండి ధర 42,520 రూపాయల వద్దకు చేరింఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం ధర కంటే 470 రూపాయల తగ్గుదల నమోదు చేసి 43,950 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 490 రూపాయల తగ్గుదలతో 46,700 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,520 రూపాయల వద్దకు చేరుకుంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 520 రూపాయల తగ్గుదలతో 46,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 590 రూపాయల తగ్గుదలతో 44,750 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరియి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 42,520 రూపాయల వద్ద నమోదు అయింది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Related Posts