YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో లాక్ డౌన్ దిశగా అడుగులు

కర్ణాటకలో లాక్ డౌన్ దిశగా అడుగులు

కర్ణాటకలో లాక్ డౌన్ దిశగా అడుగులు
బెంగలూర్, మే 1,
మే 3 తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగుస్తోన్న నేపథ్యంలో.. గ్రీన్ జోన్లలో కార్యకలాపాలు సాగించేలా కర్ణాటక ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ టీఎం విజయ్ భాస్కర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. రెడ్ జోన్ పరిధిలో ఆరు జిల్లాలు ఉండగా.. ఆరెంజ్ జోన్‌లో 5, యెల్లో జోన్‌లో 5, గ్రీన్ జోన్‌లో 14 జిల్లాలు ఉన్నాయి. రాజధాని బెంగళూరుతోపాటు మైసూర్ నగరం రెడ్ జోన్లో ఉన్నాయి.గ్రీన్ జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాల్లో కొన్ని నిబంధనలకు లోబడి ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని, కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. చామరాజ నగర్, కొప్పాల్, యాద్గిర్, శివమొగ్గ, చికమంగళూరు, కోలార్, రాయచూర్, హవేరీ, ఉడిపి, కొడగు, చిత్రదుర్గ, రామనగర, దావనగెరె, హసన్ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను తెరవడానికి, షాపింగ్ మాల్స్ మినహా దుకాణాలను తెరవడానికి కర్ణాటక ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది.బెంళూరు అర్బన్, మైసూర్, బెలగావి, బీదర్, బాగల్ కోట్, కలబుర్గి, దక్షిణ కన్నడ జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ జిల్లాల్లో నిత్యావరాలను మాత్రమే సరఫరా చేయనున్నారు.

Related Posts