YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

స్లీపర్ సెల్స్ గా మావోయిస్టులు

స్లీపర్ సెల్స్ గా మావోయిస్టులు

స్లీపర్ సెల్స్ గా మావోయిస్టులు
ఖమ్మం, మే 1
ప్రపంచాన్ని కోవిడ్‌..19 మహమ్మారి గజగజ వణికిస్తూ లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న వేళ మావోయిస్టులు ఏం చేస్తున్నారు.. వారి కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి.? ఈ వ్యాధి నుంచి తమను రక్షించుకోవడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? మొదలైన అనుమానాలు ఇంటెలిజెన్స్‌ విభాగాల అధికారుల మెదళ్లను తొలుస్తున్నాయి. రాష్ట్రంలోనే గాక తొమ్మిది ప్రభావిత రాష్ట్రాల యాంటీ నక్సలైట్‌ విభాగాల అధికారులు మావోయిస్టుల తాజా సమాచారంపై నిశితంగా దృష్టిని సారించినట్టు తెలిసింది. ప్రధానంగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలోని యాంటీ నక్సలైట్‌ విభాగంతో పాటు ఎన్‌ఐఏ సైతం ఈ దిశలోనే సీరియస్‌గా సమాచార సేకరణలో బిజీ అయినట్టు సమాచారం. గత మార్చి 22న దేశం నుంచి ఇప్పటి వరకు దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏ విధంగా నిరోధించాలనే దిశగా పోలీసు యంత్రాంగాలు క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను విధించాక ఊపిరి సలపని తీరులో వారి కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌తో పాల్గొని వచ్చి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరించడానికి కారకులయ్యారని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. తబ్లిగీలను వెతికి పట్టుకుని వారిని క్వారంటైన్స్‌కు తరలించడంలో యాంటీ నక్సలైట్‌ విభాగానికి చెందిన నిఘా అధికారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నైతే ఈ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది చేసిన కృషి కారణంగానే దాదాపుగా తబ్లిగీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్‌కు తరలించారని అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది. ఈ అసైన్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నిఘా అధికారులు ప్రస్తుతం తమ రెగ్యులర్‌ అసైన్‌మెంట్‌ అయిన యాంటీ నక్సలైట్‌ కార్యకలాపాల వైపు సీరియస్‌గా దృష్టిని సారించినట్టు తెలిసింది. దండకారణ్యంలో ముఖ్యంగా బస్తర్‌ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో అలజడి ఎక్కువగా లేక పోవడం, మావోయిస్టులకు చెందిన ప్రముఖ నాయకుల కదలికల వివరాలు ఎక్కువగా బయటకు పొక్కక పోవడం, దళాల కదలికలు సైతం స్తబ్దుగా ఉన్నాయి. ఇంతకీ అసలు మావోయిస్టు శిబిరంలో ఏం జరుగుతుందో ననే ఆసక్తి నిఘా విభాగాలలో నెలకొని ఉన్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర పోలీసులు సైతం మావోయిస్టుల తాజా కదలికల గురించి ఆరా తీస్తున్నారని తెలిసింది. ఈ మధ్య కాలంలో బస్తర్‌ ఏరియా ఐజీ యాంటీ నక్సలైట్‌ విభాగాలతో సమావేశమై మావోయిస్టుల కదలికల గురించే ఎక్కువగా ఆరా తీశారని సమాచారం. ప్రధానంగా కరోనా వైరస్‌ పట్ల మావోయిస్టుల జాగ్రత్తలు ఎలా ఉన్నాయి. తాము తీసుకుంటున్న జాగ్రత్తలనే వారు కూడా తీసుకుంటున్నారా? వారి ప్రాబల్యం ఉన్న గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో దీనికి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు పాటిస్తున్నారా..! భౌతిక దూరం గురించి ప్రచారం చేశారా... చేస్తున్నారా.. అక్కడి గిరిజనులకు కరోనా వైరస్‌ గురించి ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా ? తదితర కోణాలలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Related Posts