YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఓల్డ్ సిటీపై నజర్...

ఓల్డ్ సిటీపై నజర్...

ఓల్డ్ సిటీపై నజర్...
హైద్రాబాద్, మే 1
గ్రేటర్ నగరంలో లాక్‌డాన్ ప్రభుత్వం మే 7వరకు విధించడంతో ప్రజలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమై నిత్యావసర సరుకులకు మాత్రమే వస్తున్నారు. కానీ పాతబస్తీలో మాత్రం పూర్తిగా పరిస్థ్దితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఎక్కువగా బయటపడుతున్న అక్కడి ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. రావొద్దని ప్రశ్నించిన స్థానిక పోలీసులను కొంత మంది యువకులు, మహిళలు ఎదురుదాడి చేస్తూ మా బస్తీ మా ఇష్టామంటూ నానా హంగామా చేస్తున్నారు. గ్రేటర్ నగరంలో 141 ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా విధించి లాక్‌డౌన్ విధించారు. గత పదిరోజుల నుంచి ఒక పాజిటివ్ కేసు నమోదు కానీ 65 ప్రాంతాలను కంటైన్‌మెంటు జోన్ల నుంచి ఎత్తివేశారు.ఎక్కువగా కేసులు నమోదయ్యే భవానినగర్, అసిఫ్‌నగర్, చార్మినార్, రైన్‌బజార్, సంతోష్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, డబీర్‌పురా, తలాబ్‌కట్ట వంటి నేటివరకు కరోనా బాధితులు బయటపడుతున్నారు. వీటిని రెడ్‌జోన్లుగా ప్రకటించి వ్యాధి వ్యాప్తించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన ఏమాత్రం లెక్కచేయకుండా రంజాన్ పండగ పేరుతో విచ్చిలవిడిగా తిరుగుతున్నారు. వీరి ద్వారా కరోనా మరింత మందికి సోకే ప్రమాదముందని అధికారులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిస్తుంది.ఇప్పటివరకు నగరంలో 542కేసులు నమోదుగా అందులో పాతబస్తీ రెడ్‌జోన్ ప్రాంతాలకు చెందినవి 350కి పైగా కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో నమోదైతున్న తక్కువగా కేసులో పూర్తిగా పాతబస్తీకి ప్రాంతాలకు చెందిన కేసులే. జిల్లాలో గత గురువారం నుంచి ఒక కేసు కూడా నమోదు కావడం లేదు. రాజధాని నగరంలో నుంచే కరోనా బాధితులు బయటపడుతున్నారు.ఈ ప్రాంతాలను పూర్తిగా కట్టడి చేస్తే ఐదారు రోజుల్లో ఒక కరోనా కేసు కూడా నమోదు కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. పాతబస్తీ ప్రభుత్వం పోలీసు కంట్రోల్ ఉంటే కరోనా కట్టడి చేసినట్లేనని నగరంలో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు కూడా వైద్యశాఖ అధికారులకు సూచించారు. అందుకోసం అధికారులు ప్రత్యేక పోలీసుల బలగాలు మెహరిస్తే ప్రజలపై రోడ్లపైకి రాకుండ ఉంటారని, దీంతో కరోనా వ్యాప్తికి ముక్కుతాడు వేయవచ్చని వెల్లడిస్తున్నారు.

Related Posts