YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటికి పాట్లు

 నీటికి పాట్లు

వేసవి ఎఫెక్ట్ ఆదిలాబాద్‌ జిల్లాలోని తాగు-సాగు నీటి సరఫరాపై భారీగా ఉంది. స్థానికంగా తాగునీటి డిమాండ్ తీర్చేందుకు 18 మండలాల్లో పలు పథకాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొన్నట్లు అంతా అంటున్నారు. జైనథ్‌, బోథ్‌లలోని బహుళార్థ రక్షిత మంచినీటి పథకాలు వృథాగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 92 చోట్ల రక్షిత మంచినీటి ట్యాంకులు ఉన్నప్పటికీ ప్రయోజనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అంటున్నారు. ట్యాంకుల వద్ద నాసిరకం మోటార్లు వేశారని అవి చెడిపోయాయని చెప్తున్నారు. ఇక  పైప్‌లైన్‌ లీకేజీలతో సగం కంటే ఎక్కువ పథకాలు పనిచేయడంలేదని అంటున్నారు. ఈ తరహా సమస్యలతో జిల్లాలో మొత్తం రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకాల ద్వారా తాగునీరు పూర్తి స్థాయిలో అందని దుస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

ఈ నీటి పథకాల ద్వారా ప్రజల దాహార్తి తీరకపోగా మరమ్మతులకు తరచూ నిధులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఎత్తివేసి నాలుగునెలలు అయింది. అప్పటినుంచి ఈ పథకాలను ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తారా? లేక వదిలేస్తారా? అనేది తేలాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ దుస్థితి ఏర్పడింది. జూన్‌లోగా ఇంటింటికి కుళాయిద్వారా నీరు అందిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. అయితే చెడిపోయిన ఈ పథకాలకు ఎప్పుడు మరమ్మతులు చేస్తారు, మిషన్‌ భగీరథకు ఎప్పుడు అనుసంధానంచేస్తారనేది అంతుపట్టడంలేదు. ఆదిలాబాద్‌లోని బోథ్, ఇంద్రవెల్లి, భీంపూర్, గుడిహత్నూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో తాగు నీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. సదరు గ్రామాల్లోని నీటి పథకాలు వృధాగా పడి ఉన్నయని సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు. వేసవిలో తాగునీటికి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

Related Posts