YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తగ్గిన గ్యాస్ సిలెండర్

తగ్గిన గ్యాస్ సిలెండర్

తగ్గిన గ్యాస్ సిలెండర్
హైద్రాబాద్, మే 1
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మే ఒకటో తేదీ శుభవార్త. వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వారికి భారీ ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.214 తగ్గింది. అదేసమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.336 క్షీణించింది. కొత్త రేట్లు మే1 నుంచి అమలులోకి వస్తాయి.తాజా ధరల తగ్గింపు నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ (14 కేజీలు) రూ.583 నుంచి ప్రారంభమౌతోంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.988 నుంచి ఆరంభమౌతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్చి 15 నుంచి వీటిల్లో ఎలాంటి మార్పు లేదు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి.నగరాల వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే.. ఢిల్లీలో ధర రూ.744 నుంచి రూ.611కు దిగొచ్చింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.839 నుంచి రూ.774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ.579గా ఉంది. గత నెలలో ధర రూ.714గా ఉంది. చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.761 నుంచి రూ.569కు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.862 నుంచి రూ.796కు తగ్గింది.కాగా కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు వర్తిస్తుంది. ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి.ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ధర తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే అలాగే కూడా ఉండొచ్చు.
 

Related Posts