YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

`కర్నాటకలో మాల్స్ కు అనుమతులు

`కర్నాటకలో మాల్స్ కు అనుమతులు

`కర్నాటకలో మాల్స్ కు అనుమతులు
బెంగళూరు మే 1
కర్ణాటకలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది.చాపకింద నీరుగా విస్తరిస్తూ యంత్రాంగాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పతిష్టమైన చర్యలు చేపడుతున్నా వైరస్ విజృభిస్తోంది. మహమ్మారిని తరిమికొట్టేందుకు సర్కారు నివారణ చర్యలను ముమ్మరం చేసింది.మరోవైపు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న అధికారులు తాజా పరిస్ధితిపై అద్యయనం చేస్తూనే ... కోవిడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయినా సరే వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ.. కేసుల తీవ్రత ఇలా ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఇక కర్ణాటకలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 22 మరణాలు సంభవించాయి.మాండ్యా,బెలగావి ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 576 కి చేరింది. అయితే ఇవాళ నమోదైన 30 కొత్త కేసుల్లో 14 కేసులు బెళగావిలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలో 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు కరోనా లాక్‌డౌన్ గడువు ముగియనుండడంతో కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం మరుసటి రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని నిర్ణయించింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.అలాగే, 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఎంత దారుణంగా మారింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పిట్టాల్లా రాలిపోతున్నారు.. ఒకదశలో కరోనా పేరు చెబితే భయంతో కంపించిపోతున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేదు.. ఎవ్వరికైనా ఈ వైరస్ ఇట్టే ఎటాక్ అవుతుంది.దీంతో ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పతిష్టం చేశారు.

Related Posts