YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

న్యూయార్క్ లో కరోనా కల్లోలం..శవాలతో నిండిన నగరం!

న్యూయార్క్ లో కరోనా కల్లోలం..శవాలతో నిండిన నగరం!

న్యూయార్క్ లో కరోనా కల్లోలం..శవాలతో నిండిన నగరం!
న్యూ ఢిల్లీ మే 1
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ గజ గజ వణికిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక న్యూయార్క్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక అమెరికాలో 1095304 మందికి కరోనా సోకగా 63871 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య  234139 కి  చేరుకుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాలో కూడా ఈ విదంగా మరణమృదంగం సృష్టించలేదు. ఇకపోతే అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంది. ఇప్పటికే న్యూ యార్క్ మొత్తం కరోనా భాదితులు కరోనా మృతులతో నిండిపోయింది. ఈ తరుణంలో స్థానిక ఆండ్రూ క్లెక్లీ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో నిండి ఉన్న ట్రక్కును నిలిపి ఉంచటం స్థానికుల కంటపడింది. ట్రక్కు నుంచి దుర్వాసన రావటంతో వారు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో హుటాహుటీన నాలుగు ఏసీ ట్రక్కులను ఏర్పాటు చేసి సుమారు 50 మృతదేహాలను ఆ ట్రక్కుల్లోకి మార్చారు. అయితే ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించడం లేదు. కాగా కరోనా మహమ్మారి బారినపడి న్యూయార్క్లో  17866 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన కరోనా రోగులను పూడ్చి పెట్టేందుకు స్మశానాలు ఖాళీ లేకపోవడంతో చరిత్రాత్మక హార్ట్ దీవికి తరలిస్తోంది. అక్కడే భారీగా గోతులు తీసి శవాలను పాతిపెడుతోంది

Related Posts