YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మే 3 తర్వాత మద్యం షాపులకి గ్రీన్ సిగ్నల్..!

మే 3 తర్వాత మద్యం షాపులకి గ్రీన్ సిగ్నల్..!

మే 3 తర్వాత మద్యం షాపులకి గ్రీన్ సిగ్నల్..!
న్యూ ఢిల్లీ మే 1
కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించడంతో మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మొదట ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగుస్తుంది ఆ తరువాత మందులో మునిగితేలిపోవచ్చు అని అనుకున్నారు. కానీ కరోనా కట్టడిలోకి రాకపోవడంతో మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే . మరోసారి లాక్ డౌన్ పొడగించాలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మందుబాబులకు ఒక తీపికబురు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్ మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ సిద్దమైంది. ఒకవేళ తెరిస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది.కరోనా  కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కమర్షియల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ను పునః ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. అయితే లాక్ డౌన్ ను కొనసాగిస్తారా.. లేదా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన తర్వాతే దీనిపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం ఎడియూరప్ప స్పష్టం చేశారు. మరోవైపు గురువారం జరిగిన కేబినేట్ మీటింగ్ లో రాష్ట్ర ఆదాయం కోసం లిక్కర్ షాపులు తెరవాలని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది.అలాగే మహారాష్ట్ర సర్కార్ కూడా మే 3 తరువాత మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌ కారణంగా అందరూ ఇంటి నుండి బయటకి రాకపోవడంతో  రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా పడిపోవడంతో మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ముందడుగు వేశారు. అయితే మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడం వంటి నిబంధనలు యథాతథంగా ఉంటాయి.
 

Related Posts