YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పెర‌గ‌నున్న ఉద్యోగుల ప‌నిగంట‌లు!

పెర‌గ‌నున్న ఉద్యోగుల ప‌నిగంట‌లు!

పెర‌గ‌నున్న ఉద్యోగుల ప‌నిగంట‌లు!
న్యూ ఢిల్లీ మే 1 మే 1
రెండో విడ‌త లాక్‌డౌన్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ అనంత‌రం విధుల‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగుల ప‌నిగంట‌లు పెర‌గ‌నున్నాయా అంటే..అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ప్ర‌స్తుతం ఉన్న 8 గంట‌ల స‌మ‌యాన్ని 12 గంట‌ల‌కు పెంచే అవ‌కాశం ఉన్న‌ది. ఇందుకోసం ఆరు రాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. అయితే ఎక్కువ మంది సిబ్బందితో  కార్యాలయాలు, ఫ్యాక్టరీలు పని చేస్తే కరోనా సమస్య మళ్లీ మొదటకు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో, సగం సిబ్బందితో రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే పని చేయించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే పని వేళలను పెంచాలనే నిర్ణయం తీసుకున్నాయి.  రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పెంచిన ప‌నిగంట‌ల‌కు త‌గిన వేత‌నాన్ని చెల్లిస్తారా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Related Posts