YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలోనే జనసేన

సోషల్ మీడియాలోనే జనసేన

సోషల్ మీడియాలోనే జనసేన
కాకినాడ, మే 2,
పవన్ కళ్యాణ్ అద్భుతమైన సినిమా నటుడు. ఆయన నటనకు యూత్ ఫిదా అవుతుంది. ఆయన చేసినవి తక్కువ సినిమాలు అయినా అన్న చిరంజీవితో సమానమైన స్టార్ డం సంపాదించుకున్నాడు. ఇక అదే పెట్టుబడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ ఆ మద్దతు సరిపోవడంలేదు. దాంతో ఆయన తన ఓటమి అనుభవాలను పాఠాలుగా చేసుకుని 2024 ఎన్నికల కోసం సిధ్ధపడుతున్నాడని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అసలు మద్దతుదారులు చెక్కుచెదరలేదనడానికి తాజాగా సోషల్ మీడియాలో జనసేన గెలుపే సాక్ష్యం. గెలుపు అంటే ఇది మిగిలిన పార్టీల మీద పై చేయి గానే చెప్పుకోవాలి.వైసీపీకి 151 సీట్లు దక్కాయి. ఆ పార్టీ మిగిలిన పార్టీలను దూరం పెట్టి మరీ గత సార్వత్రిక ఎన్నికలలో విజయఢంకా మోగించింది. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ 23 సీట్లతో సర్దుకుని చతికిలపడింది. ఇవన్నీ ఇల్లా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ ఓడిపోయింది. అది కూడా జనసేన చేతిలో. అక్కడ జనసేనదే హవా. పవన్ కళ్యాణ్ పార్టీకి అక్కడ 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని సర్వేలో తేల్సింది. అదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం ఆరున్నర లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టీడీపీకైతే నాలుగు లక్షల మందే ఉన్నారు.పవన్ కళ్యాణ్ తాను యూత్ ఐకాన్ అని రాజకీయల్లో కూడా నిరూపించుకున్నారు. ఆయనకు అప్పుడూ, ఇపుడూ కూడా యూత్ మద్దతు గట్టిగా ఉంది. వారే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దాంతో ఏ పార్టీకి లేనంతమంది ఫాలోవర్స్ జనసేనకు దక్కింది. దీని మీద పవన్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉండడం అంటే ఇది గర్వకారణం అని ఆయన అంటున్నారు. ఏకంగా దక్షిణాదిలోనే ఇది ఒక రికార్డు అని కూడా పవన్ చెబుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా జన సామాన్యంలో కూడా జనసేన గెలవాలి, అపుడే అది గర్వంగా ఉంటుందని అని మేధావులు, తటస్థులు సూచిస్తున్నారు. ఓట్లు వేసేది గ్రామీణులు, నిరుపేదలు, బలహీన వర్గాలు, వారంతా కూడా సోషల్ మీడియాలో అసలు కనబడరు. వారే ఏ ఎన్నికలోనైనా విజయాన్ని చేకూర్చేది. ఆ మాటకు వస్తే టీడీపీకి, వైసీపీకి అసలైన చోట ఈ మద్దతు గట్టిగా ఉండబట్టే పునాదులు బలంగా ఉన్నాయని అంటున్నారు. పవన్ కల్యాణ‌ పార్టీ జనసేనకు సోషల్ మీడియాలో బలం ఉండడం వల్ల తన వాదనను ఆన్ లైన్ లో గట్టిగా వినిపించగలదని, కానీ బూత్ వరకూ వెళ్ళి ఓటేసే చోట బలం పుంజుకున్నపుడే అసలైన గెలుపు లభిస్తుందని అంటున్నారు. జనసేన విషయంలో ఇంకా ట్విట్టర్ పార్టీగానే పేరుందని, దాన్ని చెరుపుకుంటేనే వారు అనుకున్న టార్గెట్ రీచ్ కాగలరని చెబుతున్నారు. చూడాలి మరి అసలైన రాజకీయ మైదానంలో జనసేన కధ ఎలా ఉంటుందో.

Related Posts