YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవర్ స్టార్ కు కలిసి రాని పవర్

పవర్ స్టార్ కు కలిసి రాని పవర్

పవర్ స్టార్ కు కలిసి రాని పవర్
హైద్రాబాద్, మే 2
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన రాజకీయాల్లో అడుగుపెట్టారో కానీ ఆయనకు అన్ని కష్టాలే. సినిమాల్లో కోట్ల రూపాయల సంపాదన వదులుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అక్కడా నానా అవస్థలు పడుతున్నారు పవన్ కల్యాణ్. రాజకీయాలంటే కాస్ట్లీ అఫైర్ అని గత ఎన్నికల్లో గట్టిగానే బోధపడింది పవన్ కి. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని అనుకున్నా కనీస ఖర్చులు పెడితే కానీ పార్టీ బండి ముందుకు సాగదని ఆయనకు అర్ధం అయ్యింది. జనసేన ఘోర ఓటమి పవన్ కి అనేక పాఠాలే నేర్పింది. ఓడిన పార్టీకి ఫండ్స్ ఇచ్చే నాథులు ఎవ్వరు ఉండరని బాగా తెలిసివచ్చింది. దాంతో రూట్ మార్చి ఇటు పాలిటిక్స్ అటు సినిమాలు చేసుకుంటేనే పైసలు ఆడతాయని సమఝ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు పడవల సిద్ధాంతాన్నే ఆయన ఆశ్రయించక తప్పలేదు.పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పరంగా మంచి మార్కెట్ ఉంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లోనే. కనుక రెడీ గా ఉన్న కొన్ని సినిమా ఆఫర్లకు ఒకే చెప్పి సీన్ లోకి ఎంటర్ అయ్యారు పవన్ కల్యాణ్. ఫటా ఫట్ షూటింగ్స్ మొదలు అయిపోయాయి. జనసేన కు ఆక్సిజన్ అందాలంటే కొంతకాలం తన నట జీవితం వెండితెరపై వెలిగించే క్రమంలో పవన్ కి కరోనా షాక్ ఇచ్చింది. ఇది యావత్ ప్రపంచానికి మహమ్మారి అయినప్పటికీ ముఖ్యంగా సినిమా రంగానికి పెను విపత్తునే వైరస్ తెచ్చిపెట్టింది.ఫలితంగా ఎప్పుడు థియేటర్లు అనుమతించబడతాయో తెలియని పరిస్థితి. అలాగే ఎప్పుడు పవన్ కల్యాణ‌్ షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో ఎవ్వరు చెప్పలేని వాతావరణం. ఇలాంటి స్థితి వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. అటు సినిమాలు లేక ఇటు రాజకీయాలు లేక జనసేనాని పూర్తి ఖాళీ అయిపోయారు. అడపా దడపా తన క్యాడర్ కి ప్రభుత్వానికి సందేశాలు ఇవ్వడం మినహా ఆయన అందరికి దూరంగానే ఉండాలిసిన పరిస్థితి దాపురించింది. అనుకున్న ఫండ్స్ రాకపోవడం, సినిమాలు సెట్స్ పైనే ఆగిపోవడం భవిష్యత్తు అంధకారం లా మారడంతో జనసేన అధినేత మరికొంత కాలం వేచి చూడక తప్పదు. పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభంలో చెప్పినట్లు చుట్టూ చిమ్మ చీకటి దారి అంతా గతుకుల మాయం లాగానే ఆరేళ్ళుగా జనసేన ప్రస్థానం సాగుతుంది.

Related Posts