YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

మళ్లీ రెచ్చిపోతున్న మృగాళ్ళు

మళ్లీ రెచ్చిపోతున్న మృగాళ్ళు

మళ్లీ రెచ్చిపోతున్న మృగాళ్ళు
భోపాల్, మే 2,
ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి వైరస్ బారిన పడి భారతదేశంలో 33 వేలమందికి పైగా ఇబ్బందులు పడుతున్నారు. 1000 మంది పైగా మృత్యువాత పడ్డారు. అయితే, మృగాళ్ళు మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు.  కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం.. రోడ్లన్నీ నిర్మానుషంగా మారడంతో అత్యవసర ప్రయాణాలు చేసేవారికి రక్షణ కరువైంది. మధ్యప్రదేశ్ లో జరిగిన రెండు ఘటనలు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చేవిగా వున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయటమే కాకుండాబ్రతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. దామోలో  జరిగిన ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండురోజుల క్రితం దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్నేహితులతో కలిసి ఇంటికి కొద్ది దూరంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అప్పటినుంచి పాప కనిపించకపోవటంతో తల్లిదండ్రులు వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే మరుసటిరోజు ఇంటికి దూరంగా తీవ్రగాయాలతో పడి ఉన్న పాపను వారు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారం చేశాడు. కళ్ల దగ్గర కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామన్నారు. ఈ ఘటనలో క్రూరంగా ప్రవర్తించాడు నిందితుడు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ లోనే మరో దారుణ ఘటన జరిగింది. 18 ఏళ్ళ యువతిపై కామాంధులు కన్నేశారు. ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. బేతుల్‌ జిల్లాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన సంచలనం రేపింది. బాధితురాలు తన అన్నతో కలిసి బైక్‌పై సొంత గ్రామానికి తిరిగి వెళ్తోంది. నిందితులు వారిని అడ్డగించారు. యువతి సోదరునిపై దారుణంగా దాడిచేశారు, అతడిని బావిలోకి నెట్టేశారు. అనంతరం ఆయువతిపై అత్యాచారం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉండడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.  కరోనా లాక్ డౌన్ వేళ ఇలాంటి సంఘటనలు జరగడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related Posts