YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ ఎగ్జిట్ ప్లాన్...

మోడీ ఎగ్జిట్ ప్లాన్...

మోడీ ఎగ్జిట్ ప్లాన్...
న్యూఢిల్లీ, మే 2
అందరి దృష్టి రేపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయం పైనే ఉంది. ప్రపంచ దేశాలు సయితం లాక్ డౌన్ నుంచి భారత్ ను మోదీ ఎలా ఎగ్జిట్ అవుతారా? అన్న ఆసక్తితో చూస్తున్నాయి. మే 17వ తేదీతో భారత్ లో లాక్ డౌన్ మూడో విడత ముగియనుంది. దీంతో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తారా? లేక కొనసాగిస్తారా? అన్నది ఎక్కడ పట్టినా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో మాట్లాడిన నరేంద్ర మోదీ తీసుకునే కీలక నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కరోనా వైరస్ ఇప్పట్లో పోదు. అలాగని లాక్ డౌన్ ను నెలల తరబడి కొనసాగించే వీలులేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలూ ఆదాయాలు లేక కేంద్రం వైపు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సాయం చేయలేని స్థితిలో ఉంది. లాక్ డౌన్ ను ఇలాగే కొనసాగిస్తే ఆకలి కేకలు సంభవించే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా విన్పిస్తున్నాయి. వలస కూలీల దగ్గర నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు లాక్ డౌన్ ఎత్తివేయకుంటే రోడ్లమీదకు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికాలోనూ ఇదే జరిగిందిపోనీ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరణాలు కూడా ఎక్కువవుతాయి. ఇప్పటి వరకూ పడ్డ శ్రమంతా వృధాగా మారనుంది. లాక్ డౌన్ ను ఒక్కసారిగా తొలగించడం కూడా కరెక్ట్ కాదన్నది నిపుణుల నుంచి వస్తున్న అభిప్రాయం. దీంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను నరేంద్ర మోదీ ఎత్తివేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.దీంతో రెడ్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. గ్రీన్ జోన్ లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలన్న యోచనలో ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్ లో పరిమిత మినహాయింపులు ఇవ్వనున్నారన్న టాక్ విన్పిస్తుంది. లాక్ డౌన్ తో భారత్ జీడీపీ ఏడు శాతం తగ్గిపోతుందని ఆర్థిక వేత్తలు చేస్తున్న హెచ్చరికలతో నరేంద్ర మోదీ లాక్ డౌన్ నుంచి దేశాన్ని ఎలా ఎగ్జిట్ చేస్తారోనన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. సడలింపులు ఇచ్చేశారు దేశ వ్యాప్తంగా మూడు జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ వైరస్ అంటుకుంది. దీనిని గమనించిన ప్రభుత్వం ీఈసారి లాక్ డౌన్ విషయంలో మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముంబయి, పూనే, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాల్లో వైరస్ ఎక్కువగా ఉంది. దీంతో రెడ్ జోన్లు, హాట్ స్పాట్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిస్థాయి మినహాయింపులు ఇవ్వాలని భావిస్తుంది. ప్రజా రవాణా, మాల్స్, హోటల్స్ కు మాత్రం అనుమతిని ఇప్పట్లో ఇవ్వకూడదని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. కరోనా ఫ్రీగా ఉన్న జిల్లాల్లో ఆ ప్రాంతం వరకూ బస్సులను తిప్పే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. లాక్ డౌన్ ను మే 18వ తేదీ వరకూ పొడిగిస్తూ మినహాయింపులు కూడా అదే స్థాయిలో ఇవ్వాలని మోదీ నిర్ణయించారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తూనే మినహాయింపులు మాత్రం ఈసారి ఎక్కువగా ఉంటాయని, ప్రధానంగా చిరు వ్యాపారులు, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Related Posts