కరోనా టెన్షన్ నుంచి ఒత్తిడికి పౌండ్ ఫిట్
హైద్రాబాద్, మే 2
ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరూ వర్క్ టెన్షన్‌కి గురవుతున్నారు. దాదాపు అన్ని పనులూ సిస్టం ముందు కూర్చుని చేసేవే. ఒళ్లు ఒంగకుండా చేసేవే. కొంచెం కదిలినా పనెక్కడ ఆగిపోతుందోననే భయం.. దీంతో ఒంట్లో కొవ్వు పేరుకుపోయి చిన్న వయసులోనే బిపి, షుగర్, గుండెజబ్బుల బారిన పడాల్సి వస్తోంది. నిజానికి వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటే ఉదయమే లేవడం, వాకింగ్‌కు వెళ్లడం పెద్ద కష్టమేం కాదు. కొంతమందికి పది మందిని చూస్తే గానీ ఉత్సాహం రాదు. అలాంటి అనాసక్తికి చెక్ పెట్టేందుకు, సరికొత్త జోష్ నింపడానికి మొదలైనవే డ్యాన్స్ ఫిట్‌నెస్, ఫోక్ ఫిట్‌నెస్ వగైరాలు.పాశ్చాత్య దేశాల్లో పౌండ్‌ఫిట్ సందడి మొదలెట్టింది .ఓ గంటపాటు పౌండ్‌ఫిట్ నృత్యం చేస్తే సుమారు 900 కేలరీలకుపైనే ఖర్చవుతాయి.శరీరంలోని అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి లయబద్ధంగా సహకరించుకుంటూ వేగంగా కదులుతాయి.పలు అవయవాల్లో ఏర్పడిన దీర్ఘకాలిక నొప్పుల్ని తగ్గించుకునేందుకు ఉపకరిస్తుంది.నాజూకు నడుము కోసం ఇదో మంచి వ్యాయామం.ఒత్తిడి నుంచి ఉపశమనం మన దగ్గరా ఇది మ్యూజిక్ మస్తీతో ముందుకొచ్చింది. పౌండ్‌ఫిట్ పేరుతో చిందేసే ఫిట్‌నెస్ ట్రెండ్ 2011లో పరిచయం అయ్యింది. మ్యూజిక్ డ్రమ్స్ వాయించే కిర్‌స్టెన్ పొటెన్జా, క్రిస్టినా పీరెన్‌బూమ్ దీని రూపకర్తలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది ట్రైనర్లు వారి జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, స్టూడియోల్లో కోర్సుగా పరిచయం చేసి శిక్షణనిస్తున్నారు. బృందంగా కలసి… మ్యూజిక్ మస్తీతో… స్టెప్పులేస్తూ… చేసేదే ఈ పౌండ్‌ఫిట్. దీంట్లో వాడే కర్రల్ని వ్యాయామ పరిభాషలో ‘రిప్‌స్టిక్స్’ అని పిలుస్తారు. తక్కువ బరువుతో ప్రత్యేకంగా తయారు చేసిన వీటిని పట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ వాయించాలి. ఉన్నచోటనే శరీరాన్ని పలు భంగిమల్లో వంచుతూ లయబద్ధంగా కర్రల్ని కొడుతూ చేసే వ్యాయామమే పౌండ్‌ఫిట్. నిర్ణీత సమయానికే లేచి సీరియస్ వర్కవుట్‌లు చేయడం ఇష్టం లేనివారు ఈ రకం వాయామాన్ని ఇష్టపడతారు. 2 నుంచి 4 నిమిషాల పాటు ప్లే అయ్యే మ్యూజిక్ ట్రాక్‌తో లయబద్ధమైన నృత్య భంగిమల్ని చేస్తూ శరీరంలో కొవ్వుని కరిగించొచ్చు. తక్కువ సమయంలో శ్రమ తెలియకుండానే శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఫిట్‌నెస్ లెవల్స్‌ని పెంచుకునేందుకు దోహదం చేస్తుంది. శరీరాకృతి, దృఢత్వానికే కాదు, మానసిక వికాసానికి తోడ్పడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.స్టిక్స్ శబ్దంతో మెదడు ఉత్తేజితమై సామర్థ్యం మెరుగవుతుంది.వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.ఒత్తిడి, బద్ధకం లాంటివి దరిచేరవు.ఎలాంటి బరువులు ఎత్తకుండానే కఠిన కసరత్తులు చేస్తే వచ్చే ప్రయోజనాల్ని రెసిస్టెన్స్ బాండ్స్‌తో పొందగలం. ఫుల్ బాడీ వర్కవుట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామం. బరువు ఉండవు, పెద్దగా స్థలం అక్కర్లేదు. బ్యాండ్స్‌ని ఎక్కడికైనా తేలికగా… వెంట తీసుకెళ్లవచ్చు. మన స్థాయి, శక్తిని బట్టి లైట్, మీడియం, హెవీ అని సాగే గుణం, మందం ఎక్కువ తక్కువలు ఉన్నవి ఎంచుకోవచ్చు.పుణెకు చెందిన అమ్మాయి ఆర్తి పాండే ఏడాదిపాటు శ్రమించి దేశంలోని 130 జానపద నృత్యరీతులపై పరిశోధనలు చేసి.. వాటిని సమ్మిళితం చేసి ఫోక్ ఫిట్‌నెస్ వ్యాయామంగా రూపొందించింది. ఎప్పటికప్పుడు మార్పులు చేసేలా.. మరుగున పడిపోతున్న ఇతర జానపద నృత్యాల్ని వెలికితీసి కొత్తకొత్త ఫిట్‌నెస్ రీతులు కంపోజ్ చేసేలా తన దగ్గర ఓ బృందమే పనిచేస్తోంది. ఢిల్లీ, నాగపూర్, అహ్మదాబాద్, కోల్‌కతాల్లో బాగా పాపులరై హైదరాబాద్, వైజాగ్‌లనూ చుట్టేసిందివయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు.పెద్దగా బరువులెత్తే పన్లేదు… జిమ్‌కెళ్లే అవసరమే లేదు… ఇల్లు.. ఆఫీసు.. దేన్నైనా కసరత్తుల కేంద్రంగా మలిచేయొచ్చు… తీరైన శరీరాకృతికి… శరీరంలోని ప్రతి కండరానికీ పూర్తి వ్యాయామం… ఒళ్లు, కండరాల నొప్పులున్నవారికీ ఉపశమనం… కుర్రకారు ఎక్కువగా ఫాలో అవుతున్న రెసిస్టెన్స్ బ్యాండ్స్‌తో ఇవన్నీ సాధ్యమే… రెసిస్టెంట్ బ్యాండ్ చేతిలో ఇమిడిపోయే వ్యాయామ సాధనం. సాగే గుణం ఉండటం దీని లక్షణం. ఇందులోనూ చేత్తో పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్ బ్యాండ్స్, లూప్ బ్యాండ్స్, థెరపీ బ్యాండ్స్ ఉంటాయి. శరీరాకృతికి అనుగుణంగా నప్పేవి ఎంచుకోవాలి. ఈ బ్యాండ్‌ని కాలి కింద అదిమిపెట్టి చేతులతో హ్యాండిల్ పట్టుకొని బలాన్నంతా ఉపయోగిస్తూ ఐదు నుంచి ఇరవైసార్లు వరకు కిందికి పైకి, వెనక్కి ముందుకి స్టెప్స్ చేస్తుండాలి.మెడ, భుజం, మోకాలు, వెన్ను… ఇతర ఏ నొప్పి ఉన్నా ఉపశమనం పొందడానికి ఇదో మంచి వర్కవుట్ అంటారు ఫిట్‌నెస్ ట్రైనర్లు. భుజాలు, మెడ, వీపు, తొడలు, మోకాళ్లు… ఇలా శరీరంలోని ప్రతి భాగం, కండరాలపై ప్రభావం చూపేలా ఈ వ్యాయామం చేయొచ్చు. ఈ వ్యాయామాన్ని సైతం స్మార్ట్‌గా చేసేందుకు లిఫ్ట్ అప్ (LiftUp) అనే స్మార్ట్ బ్యాండ్ వచ్చేసింది. యాప్ సాయంతో దీన్ని మన సెల్‌ఫోన్‌తో అనుసంధానించొచ్చు. ఎలా చేయాలో సూచనలిస్తుంది. ఎంత సమయం ఎఫెక్టివ్‌గా చేశామో, ఎన్ని కేలరీలు కరిగాయో చెబుతుంది.