YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సింహాచలం ఆర్చకుడి సస్పెన్షన్ ఎత్తువేత

సింహాచలం ఆర్చకుడి సస్పెన్షన్ ఎత్తువేత

సింహాచలం ఆర్చకుడి సస్పెన్షన్ ఎత్తువేత
విశాఖపట్నం మే 2,
చందనోత్సవం రోజున బయటి వ్యక్తి ఆలయ ప్రవేశం ఘటన మలుపులు తిరుగు తోంది. ప్రయివేటు వ్యక్తికి సహకరించారనే ఆరోపణలపై గత నెల 28న సస్పెండైన అప్పన్న ఆలయ ఇన్ఛార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖామంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రధానార్చకులు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూనే.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఆ మేరకు గోపాలకృష్ణమాచార్యులు విధులకు హాజరయ్యారు.మరోవైపు చందనోత్సవం వివాదంలో సస్పెన్షన్కు గురై తిరిగి విధుల్లో చేరిన అప్పన్న ఆలయ ఇన్ఛార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిశారు. తనకు జరిగిన అన్యాయంపై దేవాదాయశాఖ మంత్రితో మాట్లాడి సస్పెన్షన్ ఎత్తివేతకు సహకరించినందుకు స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
 

Related Posts