బీజేపీ, వైకాపా ఘర్షణ
కౌతాళం మే 2,
కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి బిజెపి మధ్య చిన్న గొడవలు మొదలై తీవ్రంగా మారింది. గ్రామానికి చెందిన బిజెపి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన వైసిపి మహేందర్ రెడ్డి మనుషులు గొడవకు దిగడంతో కామారంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటరెడ్డి భార్య గర్భవతి. ఆమెను కిందకి తోయడంతో ఆమె పరిస్థితి దిగజారింది. ఘర్షణ మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ వెంటనే స్పందించి వెంకటేశ్వర్ రెడ్డిని అతని భార్యను కౌతాళం పోలీస్ స్టేషన్ కి రప్పించారు. అనంతరం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో వైసిపి అరాచకాలు ఎక్కువయ్యాయి అని అన్నారు. మహిళలు అని చూడకుండా అందులో వెంకటరెడ్డి భార్య గర్భవతి ఉండటంతో కనీసం వైసిపి వారికి జాలి దయ లేదా అని ఆయన ప్రశ్నించారు. మీ పౌరుషం ఆడవాళ్ల పైనా అని బిజెపి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. కౌతాళం పోలీస్ స్టేషన్లో 23 మంది పై కేసు ఫిర్యాదు చేశామని రామకృష్ణ తెలిపారు ఈ విషయాన్ని ఎస్సై నాగార్జున రెడ్డిని వివరణ అడగగా ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేసి విచారణ జరుపుతామని అన్నారు.