YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాత్రికేయులు సేవలు అమోఘమైనవి

పాత్రికేయులు సేవలు అమోఘమైనవి

పాత్రికేయులు సేవలు అమోఘమైనవి
ఆర్డిటి  ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణి
కౌతాళం మే 2
మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం  రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండలనికి  చెందిన దాదాపు 30 మంది జర్నలిస్టులకు కౌతాళం తాహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ  చేతుల మీదుగా మాస్క్ లు,15 కేజీల బియ్యం మరియు ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్డిటి  ఏ టి ఎల్ బాష  మాట్లాడుతూ  ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ తరఫున మేము సేవలు అందిస్తున్న మని, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ లు దరించి భౌతిక దూరం పాటించాలని, అవగాహన ప్రజలకు కల్పిస్తున్నామను, తెలిపారు.  రెడ్ జోన్ పరిధిలో వృద్ధులకు మరియు డయాబెటిక్ పేషెంట్లకు మెడిసిన్ లు పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో  సుమారు 35 వేల పైగా మాస్క్ లను ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపిణీ చేసినట్టు ఆయన తెలియజేశారు.లాక్ డౌన్ సమయం నందు పాత్రికేయుల మరియు వైద్యుల,పోలీసుల, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల,కార్మికుల సేవలు మరువలేనివని వారు తెలియజేశారు.ఈ రోజు ప్రజల్లో చైతన్య పరిచి ప్రతి విషయం ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులకు కృతజ్ఞతలు వారు నిజమైన హీరోలు అని హెల్త్ ఆర్గనైజింగ్ మైత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఆర్డిటి సంస్థ కోఆర్డినేటర్ ఏ టి ఎల్ బాష, హెల్త్ ఆర్గ నైజర్,సుధ మైత్రి ఆర్డిటి సంస్థ సిబ్బంది సీ ఓ నారాయణ, సి హెచ్ శారదా తదితరులు పాల్గొన్నారు.

Related Posts