YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రోడ్లపైకి వస్తే సీజ్

రోడ్లపైకి వస్తే సీజ్
 

రోడ్లపైకి వస్తే సీజ్
బెజవాడ, మే 2,
సీసీ కెమెరాలు, డ్రోన్‌తో నిఘా.. ఎవరైనా అన‌వ‌ర‌సంగా రోడ్ల‌పైకి వ‌స్తే.. వారి వాహనాలు సీజ్. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిని క్వారంటైన్ కేంద్రాల‌కు తరలిస్తామని హెచ్చరించిన పోలీసులు.కృష్ణా జిల్లాలో కరోనా వణికిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 258 కేసులు ఉంటే.. యాక్టివ్‌లో 206 ఉన్నాయి. 44మంది డిశ్చార్జ్ కాగా.. 8మంది చనిపోయారు. కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో జాగ్రత్తలు వహిస్తున్నారు.. జనాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.నగరంలో లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమ‌ల‌వుతుంద‌ని డీసీపీ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అంటున్నారు. ప‌డ‌మ‌ట‌లో పోలీస్ సిబ్బందితో కలిసి ల్యాండ్ మార్చ్ నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని.. ప్ర‌భుత్వాలు సూచించే జాగ్ర‌త్త‌ల‌ను ప్ర‌జ‌లంద‌రూ పాటించాల‌ని కోరారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిని క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నామ‌న్నారు.నగరంలో డ్రోన్‌, సీసీ కెమెరాల‌తో నిఘా ఉంచామని.. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మీక్షిస్తున్నారు. ఎవరైనా అన‌వ‌ర‌సంగా రోడ్ల‌పైకి వ‌స్తే.. వారి వాహనాలను సీజ్ చేస్తున్నామని.. దీంతో ప‌రిస్థితిని కొంతమేరకు చేస్తున్నామంటున్నారు పోలీసులు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో క్ర‌మంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయంటున్నారు. విజయవాడలో 18 కేసులు ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. కృష్ణ జిల్లాలో కూడా పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. విజయవాడలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.గుర్రాల రాఘవయ్య వీధిలోనే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణ లంక హాట్ స్పాట్‌గా ఉంది. విజయవాడ కృష్ణలంకలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. వారం రోజుల నుంచి వరుసగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. అక్కడ వాలంటీర్లు కూడా రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. నిత్యావసరాలు దొరక్క ఇబ్బందలు పడుతున్నారు.ఇప్పటివరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 258 కేసులు నమోదు అయ్యాయి. అందులో 200 కేసులు ఒక్క విజయవాడ నగరంలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్థానికంగా ఉన్న వ్యక్తులు నిర్లక్ష్యం వల్లే కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు అంటున్నారు. లాక్ డౌన్ పట్టించుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి వారితో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. పానీ పూరి వ్యాపారి, చికెన్ వ్యాపారి, ట్రక్కు డ్రైవర్ వంటి వారివల్ల పదుల సంఖ్యలో జనం కరోనా బారిన పడ్డారు. లాక్‌డౌన్ సమయంలో ఊరకే కూర్చోలేక తన స్నేహితులతో కలిసి ఓ డ్రైవర్ పేకాట ఆడాడు. అంతే.. తనతో కలిసి పేకాట ఆడిన 24 మందికి ఈ వైరస్ సోకింది. మరో డ్రైవర్ అనేక మందితో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పాడు. దీంతో వారందరికీ ఈ వైరస్ అంటుంకుంది. ఈ రెండు ఘటనలు విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చింది.మరోవైపు అధికారులు నగరంలో నిబంధనల్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సామాజిక దూరం పాటించకుండా కరోనా వ్యాప్తికి గురవుతున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కూడా రోడ్డుపై తిరుగుతున్న వారిపై కేసులు పెడుతున్నారు. పలు ప్రాంతాల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూ పేయింటింగ్స్ వేయిస్తున్నారు.

Related Posts