YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాష్ట్రాలు, జిల్లాలు దాటి సొంతూరు వస్తున్నారా

రాష్ట్రాలు, జిల్లాలు దాటి సొంతూరు వస్తున్నారా

రాష్ట్రాలు, జిల్లాలు దాటి సొంతూరు వస్తున్నారా
విజయవాడ, మే 2
ఇతర రాష్ట్రాలు, ఏపీలోని ఇతర జిల్లాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం మార్గర్శకాలు జారీ చేసింది. ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వారు 1902కి ఫోన్ చేయాలని సూచించింది.లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రీన్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే రిలీఫ్‌ క్యాంప్‌ల్లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని భావించే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. వారు స్వగ్రామాలకు చేరుకున్న తర్వాత కూడా మరోసారి 14 రోజుల క్వారంటైన్‌, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు.ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోవిడ్ 19 ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు మాత్రమే చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వచ్చిన వారికి స్క్రీనింగ్‌ సహా పూల్‌ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో రెడ్‌జోన్‌, కంటైన్‌మెట్‌ జోన్‌ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించింది. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్‌కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.
 

Related Posts