YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

ఇవాళ్టి నుంచి డీడీలోశ్రీకృష్ణ

ఇవాళ్టి నుంచి డీడీలోశ్రీకృష్ణ

ఇవాళ్టి నుంచి డీడీలోశ్రీకృష్ణ
న్యూఢిల్లీ, మే 2,
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో దూరదర్శన్‌లో రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లను పునఃప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు మరో సీరియల్ కూడా రేపటి నుంచి ప్రేక్షకులను అలరించనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మరోసారి పొడగించిన నేపథ్యంలో డీడీ నేషనల్ ఇప్పుడు శ్రీకృష్ణను కూడా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. రామాయణం, మహాభారతం పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో ఆ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోయింది. సరికొత్త రేటింగ్స్‌తో ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది. ఈక్రమంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను..డీడీ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్‌ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నదని ట్విట్టర్‌లో వెల్లడించారు. ,రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైంది.ఇటీవలే డీడీలో ప్రసారం అవుతున్న రామాయాణం సీరియల్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్‌ ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన కార్యక్రమంగా రికార్డు సృష్టించిందని దూరదర్శన్‌ తాజాగా ట్వీట్‌ చేసింది. ఏప్రిల్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది. మార్చి నెల 28 నుండి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ సీరియల్‌ ప్రసారమౌతున్న సంగతి తెలిసిందే. 1987లో తొలిసారి ప్రసారమైన ఈ సీరియల్‌, 33ఏళ్ల అనంతరం కూడా అదే సత్తా చాటుతోంది.

Related Posts