YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మీడియాపై సర్కార్ ద్వంద్వ వైఖరి

మీడియాపై సర్కార్ ద్వంద్వ వైఖరి

మీడియాపై సర్కార్ ద్వంద్వ వైఖరి
అమరావతి  మే 2
మీడియాపై వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.  సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని.. వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలల్లి కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు.  కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్ళైనా నిజాన్ని చెబితే వైసీపీ వాళ్ళు కుతకుతలాడిపోతుంటారన్నారు. ఆ మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారని విమర్శించారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం... వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయించడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏమిటీ అరాచకం" దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి.  ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది.  అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం.  ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని ఘాటుగా ట్వీట్ చేశారు.

Related Posts