YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మున్నేరు ఎత్తిపోతలకు కార్యరూపం 

మున్నేరు ఎత్తిపోతలకు కార్యరూపం 

 మున్నేరు ఎత్తిపోతలకు కార్యరూపం 

 21ఎంబీసి జోన్ 2 లో తొలగనున్న నైరాశ్యం 

 400 కోట్లతో మరో బృహత్తర ప్రాజెక్ట్

అడగందే అమ్మైనా పెట్టదనేది నానుడి. కాని నీళ్ళు నిధులు నియామకాలపై కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాల మాగాణా లక్ష్యంగా సాగుతుంది.ఈ యజ్ఞం లో ఎక్కడ మిగులు నీరుంటే అక్కడే ఆ ప్రాంత రైతుల ప్రయోజనాలకై కోట్లు కుమ్మరించి ప్రాజెక్ట్ ల రూపకల్పన చేస్తుంది ప్రభుత్వం.మొన్ననే భక్త రామదాసు ఎత్తిపోతల2  ప్రజలకు అంకితం చేసిన రోజున రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి లక్ష ఎకరాలకు ప్రతి నియోజకవర్గం లో సాగునీరందించాలనే ముఖ్యమంత్రి కలను నెరవేర్చిన ఘనత పాలేరు కు దక్కిందని ప్రకటించిన పక్షం రోజులలోనే జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాలలో విస్తరించిన ఎన్ ఎస్ పీ ఆయకట్టుకు ఖరీఫ్ లో ఆలస్యం కాని మున్నేరు ఎత్తిపోతల కు ప్రణాళిక చేస్తున్నారు మంత్రి తుమ్మల.మొదట ప్రాధాన్యత గా పాలేరు ను సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చి, ఇప్పుడు జిల్లా సాగు, తాగు నీటికి వనరులు వెతకనారంభించారు అధికారులు.దానవాయగూడెం వద్ద నున్నా ఆనకట్ట తో ఖమ్మం తాగునీటి అవసరాలు పోను వృధా గాపోతున్న నీటిపై లెక్క కట్టి జిల్లా అవసరాలకు ఉపయోగించాలనే తుమ్మల ఆదేశాన్ని శిరసావహిస్తూ మున్నేరు లిఫ్ట్ కు రూపకల్పన చేస్తున్నారు ఎన్ ఎస్ పి అధికారులు.మంత్రి ప్రత్యేక చొరవ తో ఎన్ ఎస్ పీ ఈఈ మంగినపూడి వెంకటేశ్వర్లు తన బృందంతో గత ఆరు నెలలుగా ఈ ప్రాజెక్ట్ పై దృష్టి సారించి అటు మంత్రి, ఇటు ఉన్నతాధికారులను ఒప్పించటంలో కృతకృత్యులయ్యారు.ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ పరిగణలోకొస్తే నాగార్జునసాగర్ జోన్ 2 పరిధిలోని వైరా జలాశయం క్రింద ఉన్న 2.20లక్షల ఎకరాలకు జూన్ నుండే నీరందించవచ్చు.జూన్ నుండి సెప్టెంబర్ వరకు జోన్2 పరిధిలో ఆశించినంత వర్షపాతం లేక రైతులు సాగుకు వెనకాడే పరిస్థితి ఉంది. అదే సమయంలో వరంగల్ పాకాల పరిధిలో వర్షపాతం అధికంగా ఉండి మున్నేరుకు నీటి ప్రవాహం అధికంగా ఉండటం తో మున్నేరు లిఫ్ట్ తో నీటిని వృధాగా పోకుండా ఎత్తిపోయాలని మంత్రి తుమ్మల ఆలోచన.తుమ్మల ఆలోచన కు అణుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొంది పనులు మొదలైతే మొత్తం మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుకు బేఫికరైనట్లే.1988 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 208, 275 ప్రకారం నాగార్జునసాగర్ -కృష్ణా డెల్టా మధ్యలో వృధాగా పోతున్న 4టీ ఎం సీ ల నీటిని సాగు అవసరాలకు వాడుకునేట్లు ప్రతిపాదించారు.దీని ప్రకారం జీవో నెం.. 1076 /2009 ద్వారా 122కోట్లతో మూడు టియంసి ల నీరు ఉపయోగించి 30వేల ఎకరాలకు నీరందించేందుకు మున్నేరు రిజర్వాయర్ స్కీమ్ ను ప్రకటించింది.మళ్ళీ కేవలం 5వేల ఎకరాలకు కుదించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తుమ్మల ఆదేశంతో జీవం పోసుకునే  ప్రతిపాదిత మున్నేరు ఎత్తిపోతల స్వరూపం.దానవాయగూడెం ఆనకట్ట పై నుండి దిగువకు వెళ్ళే నీటిని, చెక్ డ్యాంకు సమాంతరంగా 460 మీటర్ల కాలువను తవ్వుతారు.రూరల్ మండలంలోని పోలేపల్లి సమీపంలోని 21 మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఆక్విడెక్టు సమీపంలో 20 అడుగుల మేర సర్జ్పూల్ నిర్మించి కాలువ ఫోర్బే ద్వారా నీటిని నింపుతారు.అక్కడి నుండి ప్రత్యేకంగా డిజైన్లు చేసిన 6 మోటార్ల ద్వారా 30 మీటర్ల పైకి నీటిని తోడి 21ఎం బీ సి కాలువను పంపి వైరా, లంకాసాగర్ జలాశయాలను నింపి సాగు, త్రాగు నీటికి వినియోగించనున్నారు.మొత్తం 400 కోట్ల ఈ ప్రాజెక్ట్ లో 250 కోట్లు మోటార్లకు పోగా, 70 కోట్లు 133 మెగావాట్ సబ్ స్టేషన్ కు ఖర్చు కానుంది.శక్తివంతమైన ఆరు మోటార్లకు దాదాపు 90 మెగా వాట్ల విధ్యుత్ అవసరం కానుంది.ఒక్కో మోటార్ 850 క్యూసెక్కుల నీటిని తోడే  సామర్ధ్యంతో 5వేల కూసెక్కుల నీటిని ఖరీఫ్ లో 30 రోజులు అవసరాన్ని బట్టి లిఫ్ట్ చేయనున్నారు.ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి కి సమర్పించిన ఈ ప్రాజెక్ట్ నమూన పత్రాలతో సంతృప్తి చెందిన ఆయన నీటి లభ్యతపై ప్రాజెక్టు సమగ్ర నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం.అదే స్పూర్తితో అధికారులు సైతం 25లక్షలతో డీపిఆర్ సిద్దం చేసే కన్సెల్టెనీకి భాద్యత అప్పచెప్పేందుకూ సిద్దమైనట్లు తెలుస్తుంది.అంతా సవ్యంగా జరిగితే వచ్చే బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలవ్వచ్చనే అభిప్రాయం అధికారులు వెలిబుచ్చుతున్నారు. ఇక జిల్లా లోని 5-6 లక్షల ఎకరాలకు, రక్షిత మంచినీటికి భరోసా ప్రభుత్వం ఇచ్చినట్లే. 

Related Posts