మాస్కు ధరించని వారికి జరిమానా
లాక్ డౌన్ అంక్షలు అతిక్రమించిన వాహనాలు సీజ్
ఖమ్మం, మే 2
లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ జరిమానా విధించారు.
లాక్ డౌన్ అంక్షలు అమలు తీరు పరిశీలించేందుకు శనివారం నగరంలోని పలు ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ పర్యాటించారు. ఇల్లందు క్రాస్ రోడ్డులో నిర్వహిస్తున్న వాహన తనిఖీలలో మాస్క్ లే కుండా వస్తున్న వారి వాహనాలు అపి వారి భాద్యతలను గుర్తు చేస్తూ జరిమానా విధించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. లేని పక్షంలో అంటు వ్యాదుల నివారణ చట్టం కింద కేసు నమోదుతో పాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని అన్నారు. తాజాగా మాస్క్‌లు లేని వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నామని వివరించారు. కచ్చితంగా ఇళ్లనుంచి ఎవరైనా ఏదైనా పనిమీద బయటకు వచ్చినవారు మాస్క్ దరించి తీరాల్సిందేనని ,లేని పక్షంలో ఖర్చీప్ ను మాస్క్ గా మార్చుకోవాలని ఆయన సూచించారు.