జనవరి 30నే అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించాం: డబ్ల్యూహెచ్‌వో
న్యూ ఢిల్లీ మే 2
నోవెల్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడంలో ఎటువంటి జాప్యం జరగలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాము ఎక్కడా సమయాన్ని వృధా చేయలేదని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ తెలిపారు. జనవరి 30వ తేదీనే తాము అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించామని, దీంతో ప్రపంచ దేశాలు స్పందించేందుకు కావాల్సినంత సమయం ఇచ్చామన్నారు. ఆ సమయంలో చైనా బయట కేవలం 82 కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల పాజిటివ్ కేసులు ఉన్నాయి. 2.34 లక్షల మంది వైరస్‌తో చనిపోయారు. అయితే డబ్ల్యూహెచ్‌వో విఫలమైనట్లు ట్రంప్ ఆరోపణలు చేయడంతో.. టెడ్రోస్ ధీటుగా స్పందించారు. వైరస్‌ను అధ్యయనం చేసేందుకు తాము చైనా వెళ్లినట్లు కూడా చెప్పారు. తాము వైరస్ గురించి ప్రకటన చేసిన తర్వతా మూడు నెలలకు అది మహమ్మారిగా మారినట్లు చెప్పారు.