పునర్జన్మనిచ్చిన వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని.. పుట్టిన బిడ్డకు వారి పేరు!
బ్రిటన్ ప్రధాని బోరిస్ దంపతులకు గతవారం పండింటి బాబు జన్మించిన విషయం తెలిసిందే. బిడ్డ పుట్టడానికి కొన్ని వారాల ముందే కరోనా వైరస్ బారినపడి మృత్యువు అంచులు దాకా వెళ్లిన బ్రిటన్ ప్రధాని చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో తన ప్రాణాలు కాపాడిన వైద్యుల పేరును తన కుమారుడికి పెట్టి వారి రుణం తీర్చుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించారు.అంతకు ముందే ప్రధానికి కరోనా సోకగా.. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భార్య క్యారీ సీమండ్స్ నాలుగు రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కరోనాకు చికిత్స చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్టు తెలిపారు.