YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీహార్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.! వలస కార్మికుల ప్రభావం

 బీహార్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.! వలస కార్మికుల ప్రభావం

 బీహార్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.! వలస కార్మికుల ప్రభావం
బీహార్ లో కరోనా కేసులు అమాంతం పెరిగేందుకు పలు రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికుల వల్లే  దోహదపడుతోంది. ఈ దెబ్బతో బీహార్‌లో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బీహార్‌లోని 38 జిల్లాల్లో ఏప్రిల్ 14 వరకల్లా నమోదైన కేసులు 66 మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కేవలం 12 జిల్లాలకే కరోనా కేసులు పరిమితం అయ్యాయి. అయితే వలసలు ప్రారంభం కాగానే మే 2 వరకల్లా ౩౦ జిల్లాలకు విస్తరించి కేసుల సంఖ్య 475కు పెరిగింది. ఈ పెరుగుదల ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు అంటే వారం రోజుల్లో 243 కేసులు నమోదు అయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికుల వల్లే తమ రాష్ట్రంలో కొవిడ్19 బాధితుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. బీహార్ ఉత్తర జిల్లాలైన మధుబని, దర్భంగా, సీతామరి, పూర్ణియా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయిలాక్ డౌన్ కారణంగా బీహార్‌కు చెందిన వలస కార్మికులు వేలాదిమంది పలు రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. వారంతా తమ స్వస్థలాలకు వెళ్తామని ఘర్షణలకు సైతం దిగుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని ప్రస్తుతం కేంద్రం, పలు రాష్ట్రప్రభుత్వాలు వారిని బీహార్ కు చేర్చే పనిలో పడ్డాయి. నేపాల్‌కు సరిహద్దు జిల్లా కావడంతో ఆ దేశం నుంచి వెనక్కి వచ్చే వలస కార్మికుల వల్ల కరోనా విస్తరిస్తుందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమైంది.

Related Posts