YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

గురువులకే గురువు సాక్ష్యాత్ శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి

గురువులకే గురువు సాక్ష్యాత్ శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్  పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి
గురువులకే గురువు సాక్ష్యాత్ శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్  పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి గావించిన పర్వదినం కనుక  యావన్మందికి వినయపూర్వకముగా నమస్కరించి విన్నవించుకొనునది ఏమనగా...
*స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి అనగా తేది 2-5-2020 స్థిరవారం, న యావత్ ప్రపంచానికి కాలజ్ఞానం ను బోధించిన శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్  పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి 327 వ ఆరాధన గురుపూజా  మహోత్సవ దినం* .  అనగా శ్రీ స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర పర్వదినం. ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నట్లుగా ఈ ఉత్సవం ఈ సంవత్సరం జరుపుకోలేకపోతున్నాము. కారణం కరోనా మహమ్మారి వలన మనం ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండవలసిన పరిస్థితి.  రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలతో పాటు కందిమల్లాయపల్లి లోనున్న మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో కూడ ఈ ఉత్సవాలు మానుకొని పూజా కార్యక్రమాలతోనే సరిపెట్టుకొనే పరిస్థితి చూస్తున్నాం. అందుచేత  మనమందరం ఆనాడు ఎవరి ఇళ్లలో వారే ఉండి ఈ జేజినాయన పూజలు జరుపుకోవాలని, అలాగే ఆ స్వామి మనకిచ్చిన *ద్వాదశాక్షరి మహా మంత్రం " ఓం హ్రీo క్లీo శ్రీo శివాయ బ్రహ్మణే నమః"* అనే మహా మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు  పర్యాయములు జపించి ఆ స్వామిని ప్రసన్నం చేసుకొని తరించి, ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడడానికి ప్రయత్నించవలసినదిగా కోరుతున్నాను. ఈ విధానాన్ని అందరు అత్యంత భక్తి ప్రపత్తులతో  తప్పకుండా పాటించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని,  తద్వారా స్వామి వారి నిదర్శనాన్ని కూడ అందరికి తెలియజేయగలరు.
స్వామి భక్తులు పూజ చేసి తరించగలరు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
 

Related Posts