YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీకి గుబులు పుట్టిస్తున్న గొడవలు

గులాబీకి గుబులు పుట్టిస్తున్న గొడవలు

 న‌ల్ల‌గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ విజ‌యం సాధించాలని టీఆర్ఎస్ కు పార్టీ లుకలుకలు పెద్ద తలనొప్పిగా మారాయి.  నల్లగొండ జిల్లాల్లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీల్లో గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి.  చివ‌ర‌కు ఇక్క‌డ గెలుపు కోసం కేసీఆర్ సైతం స్వ‌యంగా న‌ల్గొండ ఎంపీ లేదా ఆలేరు నుంచి పోటీ చేసేందుకు సైతం రెడీగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆంధ్రా – తెలంగాణ ప్ర‌భావం ఉన్న మిర్యాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం నేత‌లు ఆధిప‌త్య పోరులో త‌ల‌మునక‌ల‌య్యారు. పార్టీ రెండు వ‌ర్గాలు చీలిపోయింది. బ‌హిరంగంగానే రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. మరో వైపు కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ అదే నిజం అంటున్నారు. నల్గొండ నుంచి కాంగ్రెస్ పక్షాన గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. అదే సమయంలో నల్గొండలో కాంగ్రెస్ హవా బాగుంది. అక్కడ జరిగిన ఎమ్మల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధాటికి గులాబీ విలవిల్లాడింది. ఇప్పుడు కేసీఆర్ వస్తే అన్ని రకాలుగా కలిసి వస్తుందని బలంగా నమ్ముతోంది టీఆర్ఎస్ క్యాడర్. మరోవైపు తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆలోచిస్తున్నాడు తెలంగాణ సిఎం కేసీఆర్. అదే సమయంలో ముందస్తుగా కేటీఆర్ ను సిఎం కుర్చీలో కూర్చో పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. పార్టీలోకి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో... విపరీతంగా చేర్చుకోవడంతో...ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న నేత‌లు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.గ‌త ఎన్నిక‌ల్లో ఎన్ భాస్క‌ర్‌రావు కాంగ్రెస్ నుంచి అమ‌రేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. భాస్క‌ర్‌రావు గెలిచిన అనంత‌రం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. గ‌త . ఇక అప్ప‌టి నుంచి ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావు త‌న వెంట వ‌చ్చిన నాయ‌కుల‌కే ప్రాధాన్యం ఇస్తూ మొద‌టి నుంచి టీఆర్ఎస్‌లో ఉంటున్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మరో వైపు నియోజ‌క‌వ‌ర్గానికి ఎవ‌రైనా కీల‌క నేత‌లు వ‌స్తే ఎవ‌రికివారు త‌మ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా ఎమ్మెల్యే న‌ల్ల‌మోతు భాస్క‌ర్‌రావు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి అలుగుబెల్లి అమ‌రేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.కేవ‌లం కాంట్రాక్టు ప‌నులు, క‌మీష‌న్ల కోస‌మే ఆయ‌న అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరార‌ని ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ఏ ప‌నులూకావ‌డం లేద‌నీ, త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌ర్గాన్ని త‌యారు చేస్తున్నార‌నీ అసెంబ్లీ వేదిక‌గా భాస్క‌ర్‌రావు టీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో పాత‌, కొత్త నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతుండ‌డం ఆ పార్టీ శ్రేణుల్లో ఆంద‌ళ‌న క‌లిగిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీఆర్ఎస్ టిక్కెట్ ఎవ‌రికి వ‌స్తుందో ? కూడా అర్థం కాని ప‌రిస్థితి.

Related Posts