YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో సడలింపులే కొంప ముంచుతున్నాయా..?

ఏపీలో సడలింపులే కొంప ముంచుతున్నాయా..?

ఏపీలో సడలింపులే కొంప ముంచుతున్నాయా..?
కర్నూలు, మే 4
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న రాష్టాలలో ఏపీ కూడా చేరిపోయింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ రోజుకి డెబ్భై, ఎనభై కేసులు నమోదవుతూ కౌంట్ దూసుకెళ్తుంది. అయినా ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం లేదు కదా ఉన్నదానిలో కూడా సడలింపులు ఇచ్చేసింది. దీంతో తదుపరి పరిణమాలపై ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది.కాగా, మరోవైపు రాష్ట్రంలో మహమ్మారి వీఐపీ సెంటర్స్ లో కూడా అడుగుపెట్టేసింది. ఆ మధ్యలో ఓ అధికార పార్టీ ఎంపీ ఇంట్లో ఆరుగురిని కమ్మేసిన వైరస్ ఏకంగా రాష్ట్ర ప్రధమ పౌరుడు గవర్నర్ రాజ్ భవన్ లోనే అడుగుపెట్టింది. ఏకంగా రాజ్ భవన్ ఉద్యోగులలో నలుగురికి వైరస్ సోకడంతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇప్పుడు తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోకి అడుగుపెట్టింది.ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నానీ పేషీలో అటెండర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ కు పంపిన వైద్యాధికారులు.. వైద్యశాఖా మంత్రి ఆళ్ల నానితో సహా అటెండర్ సేవలు అందుకున్న అధికారులను కూడా టెస్టులకు పంపారు. అయితే అందరికీ నెగటివ్ గా వచ్చిందని ప్రకటించిన ప్రభుత్వం వారిని యధావిధిగా కార్యకలాపాలకు అనుమతిచ్చింది.అయితే, దీనిపై కూడా భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్టాలలో ఎక్కడైనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ ఉన్నవారిని టెస్టులు చేయడంతో పాటు ఫలితాలలో నెగటివ్ వచ్చినా రెండు వారాలు వారిని కూడా క్వారంటైన్ లోనే ఉంచుతున్నారు. ఎందుకంటే వైరస్ లక్షణాలు రెండు నుండి నాలుగు వారాలకు బయటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.దీంతో తెలంగాణ ప్రభుత్వం అయితే క్వారంటైన్ గడువును నాలుగు వారాలకు పెంచింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పాజిటివ్ వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వారిని కూడా టెస్టులు చేసి సమాజంలోకి వదిలేయడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. గత వారంలో కోవిడ్ రాష్ట్ర కమాండ్ కంట్రిల్ కార్యాలయంలో వ్యక్తికి పాజిటివ్ వచ్చినా కాంటాక్ట్ ఉన్నవారిని క్వారంటైన్ కు పంపలేదు. ఆఫీసును మాత్రం అక్కడ నుండి చేంజ్ చేశారు. ఆ మధ్య మహారాష్ట్రలో కూడా ఓ మంత్రి పేషీలో ఇదే విధంగా పాజిటివ్ కేసు బయటపడగా ప్రభుత్వం లెక్కచేయక కాంటాక్ట్ అయిన వారిని టెస్టులు చేసి వదిలేసింది. కానీ మూడు వారాల తర్వాత ఓ వ్యక్తిలో మూడు వారాల తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. ఏపీ మంత్రి పేషీలో పాజిటివ్ కేసులో కూడా అదే విధంగా వ్యవహరించడం ఇప్పుడు సచివాలయంలో మిగతా ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది.కాగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులను, సామాన్య ప్రజలను కూడా క్వారంటైన్ చేస్తున్న ప్రభుత్వం అధికార పార్టీ నేతలను, వారి సేవకులను, బంధువుల విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతుందని ప్రజల నుండి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే.. మహమ్మారికి మాత్రం ఎలాంటి తేడాలు ఉండవని ఏపీలో పరిస్థితులను చూస్తే అర్ధమవుతుందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో కరోనా వైరస్ ఏపీలో వీఐపీ సెంటర్స్ టార్గెట్ చేసిందా అనిపిస్తుంది. ఇక్కడ వీఐపీలకు ప్రభుత్వ లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నట్లుగానే వైరస్ కూడా వారిని చుట్టేసినట్లుగా కనిపిస్తుంది. మహమ్మారికి ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారం, ధనిక-పేద తారతమ్యాలు ఉండవని.. కేవలం బాధ్యతతో కూడిన నిబంధనలను పాటించడమే ఉత్తమమైన మార్గమని ఇకనైనా తెలుసుకుంటే మంచిది.
 

Related Posts