YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

జోరుగా సాగుతున్న మద్యం

జోరుగా సాగుతున్న మద్యం

జోరుగా సాగుతున్న మద్యం
హైద్రాబాద్, మే 4
కరోనా మహమ్మారిని నివారించేందుకు ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించినప్పటికీ మరో పక్క మద్యం దందా జోరందుకుంటోంది. పలు గ్రామాల్లో నాటు సారా, కల్తీకల్లును సైతం యథేచ్చగా విక్రయి స్తున్నారు. ఆదేశాలను తప్పకుండా పాటిం చాలని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. మద్యం వ్యాపారస్తులు మాత్రం ఆ రోగం మమ్మల్ని ఏమీ చేస్తుందిలే అన్న ధీమాతో విచ్చలవిడిగా గ్రామాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారు.భిక్కనూర్‌ మండలంలోని కాచాపూర్‌, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో కొన్ని రోజుల నుంచి నాటుసారా, మద్యం, కల్తీ కల్లు దాందా జోరుగా సాగుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ ఉన్నందున మద్యం ప్రియుల కోసం గంభీరావుపేట్‌, మందాపూర్‌ గ్రామాల నుంచి కాచాపూర్‌, పెద్దమల్లారెడ్డి గ్రామాలకు మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడూ కల్తీ కల్లు, మద్యం రాత్రి సమయంలో కాచాపూర్‌ గ్రామంలో జోరుగా కొనసాగుతుందని సమాచారం.ఉదయం సమయంలో మద్యం, సారా, కల్తీ కల్లు దందా నిర్వహిస్తే ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని రాత్రి సమయంలో కాచాపూర్‌ గ్రామంలో జొరుగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం మద్యం కోసం వచ్చిన వారికి రాత్రి తాను చెప్పిన సమయానికి వచ్చి మద్యం తీసుకెళ్లాలని ముందుగానే మద్యం ప్రియులకు చెప్పి విక్రయిస్తున్నారు. కల్తీ కల్లును అయితే ఉదయమే ఇంటికివెళ్లి విక్రయిస్తున్నారు.లాక్‌డౌన్‌ ఉన్నందున ఎక్కడ మద్యం దొరక్కపోవడంతో అదునుగా చూసుకొని మ ద్యం విక్రయదారులు అధిక ధరలకు విక్రయి స్తున్నారు. నాటుసారా, కల్తీ కల్లు, అధిక ధరల మద్యం కారణంగా అమాయక ప్రజలు మత్తులో తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న నాటు సారా, మద్యం, కల్తీ కల్లు దందాను నియంత్రించాలని మండల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో పడి ప్రజల జీవితాలు నాశన మవుతున్నయని, ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖ అధికారులు మద్యం విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts