YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

కరోనా వేళ సైబర్ దోపిడీ

కరోనా వేళ సైబర్ దోపిడీ

కరోనా వేళ సైబర్ దోపిడీ
హైద్రాబాద్, మే 4
వివిధ పేర్లు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. నగరంలోని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు మొబైల్ రీఛార్జ్ చేసుకునేందుకు యత్నించగా సక్సెస్‌కాలేదు. వెంటనే గూగుల్‌లో గూగుల్ పే కాల్ సెంటర్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేశాడు. తాము చెప్పినట్లు చేస్తే మీ డబ్బులు తిరిగి వస్తాయని చెప్పడంతో అలాగే చేయడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరస్థులు రూ.40,000 దోచుకున్నారు. మరో వ్యక్తికి సైబర్ నేరస్థులు కెవైసి అప్‌డేట్ చేసుకోవాలని ఫోన్ చేయడంతో నిజమని నమ్మి వారు చెప్పినట్లు తన బ్యాంక్ మొత్తం వివరాలు వారికి పంపించాడు.తీరా చూస్తే తన బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరస్థులు రూ.1,09,000 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. న్యూ బోయిగూడకు చెందిన యువతి వాక్యూమ్ క్లీనర్‌ను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చింది. ఓ వ్యక్తి ఫోన్ చేసి దానిని తీసుకుంటానని చెప్పాడు. తాను క్యూఆర్ కోడ్‌ను పంపిస్తానని దానిని రీడ్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతాయని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన యువతి సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసింది. దీంతో బాధితురాలు రూ.40,000 పోగొట్టుకుంది. పురానాపూల్‌కు చెందిన వ్యక్తి మాస్కులు విక్రయించేందుకు జస్ట్‌డయల్ యాప్‌లో ప్రకటన ఇచ్చాడు.పెద్ద మొత్తంలో మాస్కులు కావాలని, ముందుగానే నగదు ఇస్తానని చెప్పడంతో నమ్మి అతడు పంపించిన క్యూర్ కోడ్‌ను స్కాన్ చేశాడు, వెంటనే తన ఖాతాలో ఉన్న రూ.55,000 డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ కారు డ్రైవర్ బైక్ కొనేందుకు ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసి ఫోన్‌లో సంప్రదించగా వివిధ ఛార్జీల పేరుతో రూ.78,000 దోచుకున్నారు.లాక్‌డౌన్ వల్ల నగర ప్రజలు ఇళ్లల్లో ఉంటుండడంతో వివిధ కారణాలతో ఆన్‌లైన్‌లో పనులు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారు. గతంలో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు చూసి ఫోన్ చేసిన వారిని దోచుకునే వారు, ఇప్పుడు వస్తువులు విక్రయిస్తామని ప్రకటనలు ఇచ్చిన నగరానికి చెందిన వారి నుంచి కూడా దోచుకుంటున్నారు. బయట రీఛార్జ్ చేసే సౌకర్యం లేకపోవడంతో గూగుల్ పేలో రీచార్జ్ చేసినా కూడా దోచుకుంటున్నారు. నగర సైబర్ క్రైం పోలీసులకు రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి.

Related Posts