విశాఖలో తెరుచుకున్న వైన్ షాపులు
విశాఖపట్నం మే 4
ఏపీలో మద్యం దుకా ణాలు తెరుచుకున్నాయి. విశాఖ జిల్లాలో మద్యం దుకాణాలను తిరిగి తెరిచేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం మూసివేశారు.అయితే కరోనా తీవ్రత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకు నేందుకు వెసులుబాటు కల్పించింది. విశాఖ ఆరెంజ్ జోన్లో ఉంది. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభు త్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం వుండడంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాల ప్రకారం జిల్లాలో ఉన్న మద్య దుకాణాలు తెరుచు కోవడంతో మందుబాబులు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు.