YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

వైన్ షాపులముందు బారులు తీరిన మందు బాబులు

వైన్ షాపులముందు బారులు తీరిన మందు బాబులు

వైన్ షాపులముందు బారులు తీరిన మందు బాబులు
న్యూ ఢిల్లీ మే 4
మందు చుక్క కోసం ఇన్నాళ్లూ త‌హ‌త‌హ‌లాడిన జ‌నం ఇప్పుడు తండోప‌తండాలుగా వైన్ షాపుల వైపు ప‌రుగులు తీస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా వైన్ షాపులను తెరిచారు. 40 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం షాపుల‌ను ఇవాళ ఓపెన్ చేశారు. దీంతో భారీ సంఖ్య‌లో జ‌నం షాపుల ముందు నిల‌బ‌డ్డారు.  ఢిల్లీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో వైన్ షాపుల‌ను ఓపెన్ చేశారు.  ఉద‌యం నుంచే షాపుల ముందు జ‌నం క్యూ క‌ట్టారు. కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కొన్ని చోట్ల జ‌నం మ‌రీ ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌డంతో.. సోష‌ల్ డిస్టాన్సింగ్ నియ‌మాన్ని ప‌ట్టించుకునేవారు లేరు.  కంటైన్మెంట్ జోన్ల‌లో మిన‌హా అనేక ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి.  ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్‌లో ఉన్న మ‌ద్యం షాపు వ‌ద్ద భారీ క్యూలైన్‌లో జ‌నం నిల‌బ‌డ్డారు.  రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల్లోనూ ఉన్న వైన్ షాపుల్లోనూ మ‌ద్యం అమ్మేందుకు అనుమ‌తి ఇచ్చారు. సామాజిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డంతో.. క‌శ్మీరీ గేటు ప్రాంతంలో ఉన్న వైన్‌షాపు వ‌ద్ద లాఠీచార్జ్ జ‌రిగింది.ఇక చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని రాజ్‌నంద‌గావ్ ప్రాంతంలో మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. కానీ జ‌నం ఎవ‌రూ సోష‌ల్ డిస్టాన్సింగ్ నియ‌మాన్ని పాటించ‌డంలేదు. ఆ రాష్ట్రంలో కీల‌క‌మైన కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో మిన‌హా మిగితా అంత‌టా మ‌ద్యం అమ్మ‌కాలను ప్రారంభించారు.  బెంగుళూరులో కూడా జ‌నం లిక్క‌ర్ షాపు ముందు క్యూక‌ట్టారు.  ఆ రాష్ట్రంలో ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం అమ్మేందుకు అనుమ‌తులు ఇచ్చారు.  
 

Related Posts