ఆదోనిలో తెరుచుకున్న మద్యం షాపులు
ఆదోని మే 4
కరోనా నిర్మూలన లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లో భాగంగా మద్యం షాపులు దాదాపుగా నాలభై ఐదు రోజులుగా మూసిఉంచడం జరిగింది. ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తిరిగి మద్యం దుకాణాలకు అమ్మకాలు జరిగేందుకు అనుమతులు లభించడంతో సోమవారం తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.పాత మద్యం ధరలపై కొత్త గా 25% శాతం పెంచి అమ్మకాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పెంచిన ఇరవైఐదు శాతం కలుపుకొని మద్యం అమ్మకాలుజరగాల్సి ఉండగా సర్వర్లు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభించారు. మందుబాబులు ఉదయం 10:30 నుండి మద్యం షాపుల ముందు మందు బాబులు బారులు తీరారు. మద్యం షాపుల ముందు ఎక్కడాఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్నివిధాలా చర్యలు చేపట్టారు. మందు బాబులకు పోలీస్ అధికారులు ముందస్తుగా ప్రతి వ్యక్తి భౌతిక దూరం పాటించి మద్యం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.