పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్
న్యూఢిల్లీ మే 4
ఆకాశంలోని పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్‌ను ఖగోళ పరిశోధకులు గుర్తించారు. భూమికి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మృత నక్షత్రం ఎస్‌జీఆర్ 1935+2154 నుంచి వెలువడ్డ ఈ రేడియో అయస్కాంత తరంగం మన గెలాక్సీలో తిరుగుతున్నట్లు గమనించారు. నక్షత్రంలో భూపంకాలు లేదా మృత నక్షత్రంలో గురుత్వాకర్షణ శక్తిలో భారీ మార్పుల వల్ల ఈ రేడియో సిగ్నల్ ఉద్భవించి ఉండవచ్చని తెలిపారు.