YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

కిరాణ షాపుల నుంచి కరోనా వ్యాప్తి..!

కిరాణ షాపుల నుంచి కరోనా వ్యాప్తి..!

కిరాణ షాపుల నుంచి కరోనా వ్యాప్తి..!
హైదరాబాద్ మే 4
తెలంగాణాలోని అన్ని జిల్లాలో కరోనాను కట్టడి చేసినా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రతి రోజూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ వ్యాప్తికి కారణమైన మూలల అన్వేషణలో కొత్త నిజాలు వెలుగు చూశాయి..గత నాలుగు రోజులుగా కిరాణ షాపుల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు.. ఈ నాలుగు రోజులలోనే ఈ షాపుల ద్వారా 18 మందికి సోకిందని తేలింది.  దీంతో కిరాణా వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  కాగా లాక్ డౌన్ లో అన్నీ బంద్ అయినా ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసరాలు అమ్మే షాపులకు  మాత్రం ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ వెసులుబాటే ఇప్పుడు కొత్త సమస్యకు దారితీసింది.హైదరాబాద్ లో బస్తీలు, కాలనీల్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కరోనా వైరస్‌కు కేంద్రంగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు. బేగంబజార్, మలక్‌పేట్‌ గంజ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు వైరస్‌ విస్తరిస్తుంది. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు, కాలనీల్లోని కొనుగోలుదారులకు వైరస్‌ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లోని చిన్న చిన్న కిరాణా షాపు నిర్వాహకుల్లో చాలా మందికి కరోనాపై సరైన అవగాహన లేదు. వీరు హోల్‌ సేల్‌ దుకాణాల నుంచి వస్తువులు తెచ్చిన తర్వాత వాటిపై శానిటైజ్‌ స్ప్రేలు చల్లడం లేదు. కనీసం షాపునకు వచ్చిన వారు సామాజిక దూరం పాటిస్తున్నారో..? లేదో కూడా చూడటం లేదు. అంతే కాదు వీరిలో ఎవరికి..? ఏ ఆరోగ్య సమస్య ఉందో..? గుర్తించక పోవడం..ఆయా వస్తువులనే నేరుగా కొనుగోలుదారుల చేతికి అందిస్తుండటం..వారు ఇచ్చిన నగదును నేరుగా తీసుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

Related Posts