YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు..

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు..

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు..
క‌డ‌ప‌, మే 4
కరోన లాక్ డౌన్ నేపధ్యంలో కష్టాలెదుర్కోoటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.. సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కడప జిల్లా కార్యాలయం ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాలు లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య,కార్యవర్గ సభ్యులు క్రిష్ణ మూర్తి,నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి వెంకట శివ, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి బాదుల్ల, భాగ్యలక్ష్మి, దస్తగిరి, వలరాజ్,పవన్ తదితరులు దీక్ష లో కూర్చున్నారు.. నేడు కరోన విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలు, పేదల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 50మంది బడాబాబులు తీసుకున్న 69వేల కోట్ల రూపాయలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి పేదల,రైతుల కార్మికుల వెతలు పట్టించుకోక పోవడం దుర్మార్గపు చర్యలు అని వారు విమర్శించారు. మోడి అధికారంలోకి వచ్చిన 6సంవత్సరాలలో 6.66లక్షల కోట్ల రూపాయలు రుణ బకాయిలును మాఫీ చేసి కార్పొరేటు శక్తుల దత్త పుత్రుడు గా నిరూపించు కున్నాడు. కరోన మహమ్మారి పేదలజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రదాని మోడి పేదలకు నామమాత్రపు ప్యాకేజీ ఇచ్చాడు. కరోన మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుoది. లాక్ డౌన్ వలన ముఖ్యంగా వలస కూలీలు ఎక్కడి వారక్కడే ఉండి పోవాల్సిన పరిస్తితి వచ్చిoది.వారు వారీ కుటుంబాల గురించి తీవ్ర వేదన అనుభవించారు. వలస కూలీలను స్వస్టలాలకు చేర్చేoదుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో వారందరినీ సొంత ఊళ్లకు రప్పించాలి. భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గిడ్డంగిలలో నిల్వఉన్న ఆహార ధాన్యంను రాష్ట్రాలకు కోటి టన్నులు విడుదల చేయాలి. రభీ సీజన్లో ఉత్పత్తి అయినా ధాన్యంను జిల్లా ప్రజలకు పంపిణీ చెయ్యాలి. ప్రతి పేదవానికి 50 కేజీల బియ్యం ,30కేజీల గోధుమలు ఇవ్వాలి. దీనితో పాటు కేంద్రం 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున మొత్తం 10,000 ఆర్దిక సహాయం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు కల్పించాలి. పింఛను దారులకు పూర్తి పింఛను చెల్లించాలి. ఉద్యోగులకు భద్రత కల్పించాలి.రైతులు, చిరు వ్యాపారులు,స్వయం ఉపాది కల్పన క్రింద బ్యాంకులు ఇచ్చిన రుణాలు రద్దు చెయ్యాలి. చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేoదుకు లక్ష కోట్లతో ప్యాకేజీ ప్రకటించాలి. ఎక్కడ ఆకలి చావులకు ఆస్కారం లేకుండా చూడాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలు మౌన దీక్షలు చేపట్టారని, పార్టీ శ్రేణులు అందరు పేదలకు అండగా ఉండాలని కోరారు. పూట గడవని గడపదాటని అభాగ్యులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు..
 

Related Posts