YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మందుబాబుల డ్యాన్సులే...డ్యాన్సులు

మందుబాబుల డ్యాన్సులే...డ్యాన్సులు

మందుబాబుల డ్యాన్సులే...డ్యాన్సులు
తిరుపతి, మే 4
ఓ మందుబాబు చాలా రోజుల తర్వాత మద్యం దొరికిందన్న ఆనందంతో డ్యాన్సులు చేశాడు. చిత్తూరు జిల్లా సత్యవేడులో ఈ సీన్ కనిపించింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.ఏపీలో మద్యం అమ్మకాలతో మందబాబులు పండగ చేసుకుంటున్నారు. ఉదయం నుంచే షాపుల ముందు బారులు తీరారు. లిక్కర్ షాపులు తెరవడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ మందుబాబు చాలా రోజుల తర్వాత మద్యం దొరికిందన్న ఆనందంతో డ్యాన్సులు చేశాడు. చిత్తూరు జిల్లా సత్యవేడులో ఈ సీన్ కనిపించింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అంతేకాదు కొంతమంది ఆనందంతో బాణాసంచా కాల్చారు.. మద్యం దుకాణాల ముందు కొబ్బరి కాయలు కొట్టారు.సోమవారం నుంచి లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉదయం నుంచి సందడి వాతావరణం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్యూ లైన్లు దర్శనమిచ్చాయి.. కిలోమీటర్ల పొడవున బారులు తీరారు. షాపులు ఓపెన్ చేయకముందే మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించాలని చెప్పినా.. కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. జనాలు గుంపులుగా ఉండటంతో కరోనా ఎక్కడ వ్యాపిస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల్లో మద్యం షాపులు ఆలస్యంగా ఓపెన్ చేశారంటూ కొంతమంది మందబాబులు ధర్నాలకు దిగారు.

Related Posts