YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

మందు కోసం మద్యం ప్రియుల క్యూ

మందు కోసం మద్యం ప్రియుల క్యూ

మందు కోసం మద్యం ప్రియుల క్యూ
హైద్రాబాద్, మే 4,
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతబడ్డాయి. తాజాగా లాక్‌డౌన్ 3.0 అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లిక్కర్ షాపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ మద్యంలేక అల్లాడిపోయిన మద్యంప్రియులకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. సోమవారం (మే 4) ఉదయం నుంచే వైన్ షాపుల వద్ద బారులు తీరారు. దేశవ్యాప్తంగా పలు మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అలాంటి రాష్ట్రాలకు చెందిన వారు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో మద్యంషాపుల వద్ద బారులు తీరడం గమనార్హం. మద్యం విక్రయాలకు అనుమతిచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఏపీ సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ ప్రజలు.. అక్కడి వైన్ షాపుల వద్దకు క్యూ కడుతున్నారు.భద్రాచలం పట్టణానికి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలో ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఉంది. ఇంకేం.. అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు భారీగా ఆ షాపు వద్దకు చేరుకున్నారు. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులంతా ఎగబడటంతో అక్కడ కిలోమీటర్‌కు పైగా క్యూ లైన్ ఏర్పడింది. అయినా.. ఓపికగా నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. మద్యం చేతికి చిక్కిన తర్వాత కొంత మంది ఆనందంతో డ్యాన్స్ కూడా చేస్తున్నారు.

Related Posts