YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మరింత జోరుగా వెంకట్ రెడ్డి టీమ్

మరింత జోరుగా వెంకట్ రెడ్డి టీమ్

ఆయన సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కూడా, పదవులంటే లెక్కలేదు.  నా రేంజ్ సీయం కుర్చే ఇది ఆయన కామెంట్. కాంట్రవర్సీ స్టేట్ మెంట్లకు ఆయన కేరాఫ్. సొంత పార్టీనేతలకూ, అధికార పార్టీ నేతలకూ కంటిమీద కునుకు లేకుండా చేసే స్టాటజీ ఆయనది.  అంతా భాగనే ఉన్నా సభాకాలం ముగీయక ముందే తన సీటును కోల్పోయి ఇరకాటంలో పడ్డాడు.  అంతా ఆయన పని అయిపోయింది అనుకున్నా, ఎక్కడ ఫోయిందో అక్కడే వెతుక్కొవాలి అన్న సామెతకు భిన్నంగా ఎక్కడ కొడితే కుంభస్ధలం కదులుతుందో అక్కడి బాటపట్టారు. నల్లగొండ ఎమ్మెల్యే కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన స్పీడ్ ను మరింత పెంచారు. శాసనసభలో తన సభ్యత్వం రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత ఈ సీఎల్పీ ఉపనేత మరింత జోష్ తో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. స్పీకర్ నిర్ణయం తరువాత న్యాయం కొసం కొర్టు మెట్లెక్కిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యాయపోరాటం చేస్తూనే,  నల్లగొండ జిల్లాలో తన ప్రాభల్యం పెంచుకునేందుకు తనదైన శైలిలో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొత్త నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను ఒక రౌండ్ చుట్టేసిన వెంకట్ రెడ్డి ప్రత్యర్దులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.  తన సభ్యత్వం రద్దు నిర్ణయం తరువాత మరింత కసితో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. సభ్యత్వం రద్దు తరువాత కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతాని అధికార పార్టీ ఊహించడంతోపాటు, రాజకీయంగా ఆయన దూకుడుకు కళ్లెం పడినట్లే అని భావించిన సొంత పార్టీ నేతలకు సైతం గుక్కతిప్పుకొకుండా చేస్తున్నారు. గతంలో కంటే దూకుడుగా కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తుండటం ఇప్పుడు తాజాగా నల్లగొండ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన ప్రాభల్యం పెంచుకునేందుకు యత్నించిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్రమంలో సొంత పార్టీ కాంగ్రెస్ నేతల నుండే వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నేతల నియోజకర్గాలపై తన శైలిలో పర్యటనలు పెట్టుకుని పెత్తనం చేసే ప్రయత్నం చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అప్పట్లో ఆయన పప్పులు ఉడకలేదు సరికదా,  సొంత పార్టీలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్నారు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆ తరువాత రాష్ట్రం ఏర్పడటం,  అదే క్రమంలో కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కావడంతో తన వ్యూహాం మార్చిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలపై కన్నేసారు. ఈ క్రమంలోనే సందర్భం దొరికితే చాలు నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునాసాగర్, దేవరకొండ, నకిరేకల్, మునుగొడు, నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ క్యాడర్ లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  నాగార్జునాసాగర్ కు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కొంత అసహానం వ్యక్తం చేసినా.. అన్ని సర్దుకుంటాయి అన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు మరికొందరు కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాల్లో ఈయన పెత్తనం ఏంటి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటగెలిచి రచ్చగెలిస్తే బాగుంటుంది అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు... మరికొందరు నేతలు కందకులేని దురద  కత్తికి ఎందుకు అంతా అధిష్టానం చూసుకుంటుందన్న భావనలో ఉన్నారు. మరోవైపు ఇదంతా డొంట్ కేర్ అంటున్నారు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శాసన సభ్యత్వం రద్దు నిర్ణయం తరువాత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుకు కళ్లేం పడుతుంది అనుకుంటే, గోడకు కొట్టిన బంతి తిరిగివచ్చినట్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం ఇప్పడు అధికార పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది.  వడగళ్ల వర్షం పడి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట నష్టం జరిగితే అధికార పార్టీ నేతలెవ్వరూ అటువైపు చూసిన పాపాన పోకపోవడం,  కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం తీవ్రస్దాయిలో విమర్శలు చేయడం అధికార పార్టీకి చెంపపెట్టులా మారడంతోపాటు,  సొంతపార్టీ కాంగ్రెస్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.  

Related Posts