YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

614 మంది విద్యార్థులకు విముక్తి

614 మంది విద్యార్థులకు విముక్తి

614 మంది విద్యార్థులకు విముక్తి
ఎమ్మెల్యేకు ధన్యవాదాలు  తెలిపిన వివిధ ప్రజాసంఘాల నాయకులు
నంద్యాల మే 4
కరోనా వైరస్ ,లాక్ డౌన్ తో నంద్యాలకు పరిమితమైన శ్రీ గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ విద్యార్థుల కు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి చోరువతో విముక్తి లభించిందని తెలిపారు. .ఎన్ జీ ఓ కాలనిలో గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారని .కరోనా నేపథ్యంలో నంద్యాలలో విద్యార్థులు చిక్కుకొనిపోయారని .గత 40 రోజులుగా విద్యార్థులకు  విజయకుమార్ ప్రతిరోజు సుమారు 70 వేలు సొంత డబ్బులతో విద్యార్థులకు టిఫిన్,భోజన వసతి కల్పించారు. .స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సహాయ సహకారాలోతో పాటు,దాతలు,ప్రభుత్వం విద్యార్థులను ఆదుకున్నారని .విద్యార్థుల బాధలను అర్తంచేసుకుని ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులను తెలంగాణాకు పంపే విధంగా అనుమతులు తీసుకొని వచ్చారు.ప్రత్యేక 6 ఆర్టీసీ బస్సుల ద్వారా 468 విద్యార్థులను తెలంగాణా రాష్ట్రానికి పంపించారు.అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన 216 మంది విద్యార్థులను ప్రతీక బస్సుల ద్వారా పంపించారు.పట్టణంలో కరోనా వ్యాదిన పడకుండా అహర్నిశలు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆ ప్రాంతావాసులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు.పట్టణ వాసులకే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను,వలస కూలీలను వారి,వారి రాష్ట్రాలకు పంపించారు.మా సమస్యలు తెలుసుకొని ఇన్ని రోజులు ముడుపుటలు అన్నానికి ఇబ్బంది లేకుండా చూశారని ఎమ్మెల్యే కు విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు.కాలనీ లోని రామాలయం వద్ద ఆర్డీఓ రామకృష్ణారెడ్డి,తాహశీల్దారు రవికుమార్ లు దగ్గరుండి విద్యార్థులను స్వస్థలాలకు పంపించారు.విద్యార్థులకు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర రావు,మాజీ ఎంపీ కవిత,ఎమ్మెల్యే రవి చంద్రకిశోర్ రెడ్డి గార్లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు. వంకిరి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts