YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి ఆర్ధిక కష్టాలు

టీడీపీకి ఆర్ధిక కష్టాలు

టీడీపీకి ఆర్ధిక కష్టాలు
గుంటూరు, మే 5
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇటు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పార్టీ ఉంది. అధికారం కోల్పోవడంతో పాటు గత ఎన్నికల్లో నిధులు రాకపోవడంతో పార్టీ ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉందన్నది వాస్తవం. అధికారంలో లేకపోవడంతో పార్టీకి నిధులు ఇచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుంది. సహజంగా పారిశ్రామిక వేత్తలు కూడా అధికార పార్టీవైపు చూస్తారు. ఇక తనకు ఆర్థికంగా దన్నుగా నిలచే సామాజికవర్గాన్ని జగన్ వెన్ను విరుస్తుండటంతో టీడీపీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతుందన్న వార్తలు వస్తున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఇదే స్పష్టమయింది. అప్పట్లోనే చంద్రబాబు జిల్లాల పర్యటనలకు కొందరు నేతలు అభ్యంతరం తెలిపారు. ఇందుకు కారణం ప్రధానంగా నిధుల కొరతేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈలోగా కరోనా రావడంతో మరింత పరిస్థితి దిగజారింది. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా ఆదుకునేవారందరూ వ్యాపార వర్గాలే. కాంట్రాక్టర్లు. అయితే కరోనా నేపథ్యంలో వారి పరిస్థితే ఆర్థికంగా బాగా లేదు. వారు పార్టీకి సాయం చేసే పరిస్థితి లేదు.ఇటీవల చంద్రబాబు కరోనా సమయంలో ప్రజలకు సేవలందించేందుకు సాయం అందించాలని కొందరు పారిశ్రామికవేత్తలను స్వయంగా ఫోన్ చేసి కోరినట్లు తెలుస్తోంది. తాను అధికారంలో ఉండగా లబ్ది పొందిన వారినే చంద్రబాబు సంప్రదించారు. వారిచ్చే నిధులతో ప్రజలకు టీడీపీ తరుపున రాష్ట్రంలో సేవ చేయాలన్నది ఒక లక్ష్యం కాగా, ఉచిత భోజనాలను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ఆలోచించారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలను కొందరిని చంద్రబాబు అభ్యర్థించారు.అయితే వారు తమ పరిస్థితి బాగాలేదని చేతులెత్తేయడంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కేవలం మాస్క్ లను మాత్రమే పంపిణీ చేశారని, అది కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసమే పంపగలిగారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంతో సమానంగా కార్యక్రమాలు చేయాలనుకున్న చంద్రబాబుకు ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి రాకపోవడానికి కూడా ఇదొక కారణంగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు

Related Posts