YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో 8 నుంచి మద్యం అమ్మకాలు

తెలంగాణలో 8 నుంచి మద్యం అమ్మకాలు

తెలంగాణలో 8 నుంచి మద్యం అమ్మకాలు
హైద్రాబాద్, మే 5
నలభై రోజులు పైగా మూతపడిన మద్యం దుకాణాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వైన్‌షాప్‌ల ద్వారా మద్యం విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తోంది. అయితే గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్‌ల మాదిరి విభజించుకుని కాకుండా రాష్ట్రం మొత్తం వైన్‌షాప్‌లు ఒపెన్ చేయాలని ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది వాస్తవానికి రాష్ట్రానికి మద్యం ద్వారా నెలకు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, మద్యం దుకాణాలను కూడా అనుమతించలేదు.ఆదాయం కోల్పోయినా సరే.. ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ విక్రయాలు అనుమతించేది లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో మద్యం విక్రయాలకు అనుమతించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైన్‌షాప్‌లు తెరవబోమని మళ్లీ స్పష్టం చేశారు. అయితే తెలంగాణకు సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోని పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో అక్కడి నుంచి అక్రమ మద్యం ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. భద్రాచలం పట్టణానికి కేవలం అర కి.మీ దూరంలో ఉన్న ఎపి పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఇది. అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు అక్కడికి చేరుకున్నారు. ఇలా రాష్ట్ర ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రతీ వైన్‌షాప్ దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కర్నాటక, ఎపి రాష్ట్రాల్లో సోమవారం మద్యం విక్రయాలు ప్రారంభం కావడంతో కిలోమీటర్ల కొద్దీ మద్యం ప్రియులు బారులు తీరారు. అలాగే ఎటువంటి భౌతిక దూరం పాటించలేదు. కొంతమందికి మాస్కులు కూడా లేవు. ఇటువంటి పరిస్థితులతో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నందున అలా కాకుండా ఖచ్చితమైన జాగ్రత్తలు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

Related Posts