వర్క హాలిక్ గా..లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ, మే 5
లవ్ అగర్వాల్ … ఈ పేరు చాలాముందికి తెలియక పోవచ్చు. అది సహజం కుాడా. అధికార వర్గిల్లోనూ కొందరికే సుపరిచితుడు. అయితే అఖిలభారత సర్వీస్ అధికారుల్లో అత్యంత సుపరిచితుడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అధికారుల నోట్లో ఆయన పేరు ఎప్పుడుా నానుతుంటోంది. అయితే గత కొద్ది రోజులుగా లవ్ అగర్వాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అంతర్జాతీయంగా కూడా ఆయనపేరు వెలుగులోకి వస్తోంది. కరోనా నేపధ్యంలో కేంధ్రవైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. కరోనా సమాచారం పాత్రికేయులకు వివరిస్తూ టెలివిజన్ ఛానళ్ళలో కనపడుతున్నారు. విలేకరుల సమావేశంలో ప్రత్యక్షమవుతున్నారు.కరోనా కారణంగా దేశమంతా ఆందోళనలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శిగా చాలా ధైర్యంగా కనపడుతున్నారు. ఎంతటి ఆందోళనకర సమాచారాన్ని సైతం చాలా ప్రశాంతంగా వెల్లడిస్తున్నారు. ఆయన మాటల్లో, చేతల్లో, హావభావాల్లో కరోనాను దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనాను పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను సమృద్ధిగా వివరిస్తున్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల విధానాలను విశ్లేషిస్తున్నారు. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రానికి విలువైన సుాచనలు, సలహాలు, అందజేస్తున్నారు. కేంద్రం చర్యలను, విధానాలను చాలా స్పష్టంగా, సమర్ధంగా, చేరవేస్తున్నారు. అంతిమంగా తన బాద్యతల నిర్వాహణలో సంపూర్ణ చిత్తశుద్ధి కనబరుస్తుా ప్రభుత్వ ప్రశంసలు పొందుతున్నారు. కరోనాను అరికట్టడంలో వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు, శాస్త్రవేత్తల కృషి, ప్ఱభుత్వపరంగా చేయాల్సిన పనుల గురించి నిత్యం ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. స్వయంగా వైద్యుడైన డాక్టర్ హర్షవర్ధన్ వైద్యఆరోగ్యశాఖకు సంబంధించి లవ్ అగర్వాల్ పరిజ్ఞానాన్ని చుాసి ఆశ్చర్యపోతున్నారు.వర్క్ హాలిక్ గా పేరుగాంచిన లవ్ అగర్వాల్ రాత్రి 12 గంటల వరకు తన శాఖకు చెందిన వ్యవహారాల్లో తల మునకలవుతున్నారు. మళ్ళీ ఉదయాన్నే అందరికన్నా ముందుగానే కార్యలయానికి హాజరవుతారు. కరోనా యావత్ ప్రపంచాన్ని ముఖ్యంగా దేశాన్ని కబళిస్తున్న తరణాలు సంబదిత శాఖ సంయుక్త కార్యదర్శిగా దేశానికి సేవలు అందించడం తన అదృష్టమని ఆయన భావిస్తుంటారు. కరోనా సమస్య పరిష్కారమయ్యే వరకు తనకు విశ్రాంతి లేదని లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.లవ్ అగర్వాల్ యూపీ లోని షహరాన్ పుర్ జిల్లాకు చెందినవారు. తండ్రి ప్రముఖ ఛార్టెడ్ ఎకౌంటెంట్. కుమారుడిని కుాడా ఈ వృత్తిలోకి తీసుకురావాలని భావించారు. కానీ లవ్ అగర్వాల్ దృష్టి ఇంజనీరింగ్ పైకి మళ్ళింది. ఈ ప్రయంత్నంలో విజయం సాధించి ఢిల్లీ ఐఐటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. అనంతరం సివిల్స్ పై దృష్టి పెట్టారు. ఒక ఇంజనీరుగా కన్నా ఒక ఉన్నతాధికారిగా ఎక్కువగా ప్రజలకు సేవ చేయగలమని భావించడమే ఇందుకు నిదర్శనం. 1996 లో ఐఏఎస్ అధికారిగా ఎంపికైన తర్వాత ఆయనను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. కృష్ణా జిల్లా అసిస్టింట్ కలెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత భద్రాచలం సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. అనంతరం మెదక్, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో జాయంట్ బీమ్ ఎలక్టోరల్ ఆఫీసరుగా, రెవెన్యు, విపత్తు కార్యదర్శిగా పనిచేశారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. 2016 లో కేంద్రాల కి డిప్యూటేషన్ పై వెళ్లారు. ప్రతి ఐఏఎస్ అధికారి ఏ రాష్ట్ర క్యాడర్ అయినప్పటికి విధిగా కొంతకాలం కేంద్రంలో పనిచేయాలి. దీనినే డిప్యుటేషన్ అని వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే 2016 లో లవ్ అగర్వాల్ కేంద్రానికి వెళ్ళారు. 2021 వరకు కేంద్రంలో ఉండి తిరిగి ఏపీకి వస్తారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్ సేవలు ప్రశంసనీయమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు.