YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఒక్క రోజే 40 కోట్ల అమ్మకాలు

ఒక్క రోజే 40 కోట్ల అమ్మకాలు

ఒక్క రోజే 40 కోట్ల అమ్మకాలు
విజయవాడ, మే 5
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ‌గా 411 మద్యం షాపుల విక్ర‌యాలు ప్రారంభించాయి.ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. దాదాపు నలబై రోజుల తర్వాత షాపులు తీయడంతో.. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క రోజే మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.40 కోట్లుకుపైగా ఉండొచ్చని సమాచారం అందుతోంది. దీనిపై అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ‌గా 411 మద్యం షాపుల విక్ర‌యాలు ప్రారంభించాయి. రెండో రోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.. నాలుగైదు రోజులకు పరిస్థితి సద్దుమణుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. మద్యం షాపుల వద్ద గుంపులుగా ఉండటానికి వీల్లేద.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఒక్కో విడతలో కేవలం ఐదుగురినే మద్యం షాపుల్లోకి అనుమతిస్తారు. మద్యం షాపుల ముందు సామాజిక దూరం పాటించేలా సర్కిల్‌ ఏర్పాటు చేస్తారు.. మాస్క్‌ లేనిదే మద్యం దుకాణాల వద్ద వచ్చేందుకు అనుమతి లేదు. మద్యం దుకాణాల వద్ద ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఆ షాపులను కొంత సమయం మూసేస్తారు. కంటైన్మెంట్‌ జోన్ల బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు

Related Posts